కరుణామయుని కోవెలలో..

26 Dec, 2019 06:10 IST|Sakshi
చర్చిలో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు, దైవ సందేశమిస్తున్న బిషప్‌ సాల్మన్‌రాజ్‌

సాక్షి, మెదక్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి భారీ ఎత్తున భక్త జనం తరలివచ్చారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రహదారులు బుధవారం వాహనాలు, భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తు ల రాక ప్రారంభమైంది. ఉదయం 4.30 గంటలకు జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్‌ఐ చర్చి బిషప్‌ సాల్మన్‌రాజ్‌ దైవసందేశం ఇచ్చారు. చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు క్రైస్తవులతోపాటు హిందువులు, ముస్లింలు కూడా రాగా.. మతసామరస్యం వెల్లివిరిసింది. కాగా, క్రిస్మస్‌ సందర్భంగా చర్చి ప్రాంగణం జాతరను తలపించింది. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికారులతోసహా మొత్తం 450 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయితే.. పట్టణంలో కేటాయించిన మూడు పార్కింగ్‌ స్థలాలు కిక్కిరిసి పోగా.. రహదారుల వెంటే వాహనాలను పార్కింగ్‌ చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్య నెలకొంది.   

దేవుడి ఆశీస్సులతో అభివృద్ధి: హరీశ్‌రావు
ఏసయ్య జీవితాంతం ప్రజల కోసమే బతికారని మం త్రి హరీశ్‌రావు అన్నారు. దయ, కరుణ, ప్రేమ గుణాల ను ప్రతీ మనిషి కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్‌  దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకు ముందు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి సంబరాల్లో పాల్గొన్నారు.

సీఎస్‌ఐ చర్చి ముందు భక్తుల రద్దీ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

నేటి ఉదయం దైవదర్శనాలుండవు

కీచక ఖాకీ! 

4,100 మందికి లబ్ధి

గోదారి పరుగుకు పునరావాసం అడ్డు

ఆర్టీసీలో ఇక 60 ఏళ్లు

ఇద్దరికి మించి సంతానమున్నా..

‘జాతీయ పౌర రిజిస్టర్‌ను ఆపండి’

ఐస్లాండ్‌లో పేలిన అగ్ని పర్వతం

11 నెలలు.. రూ. 100 కోట్లు

ఫార్మాసిటీకి ‘నిమ్జ్‌’ హోదా

గోల్డ్‌స్టోన్‌కు గట్టిదెబ్బ

కేంద్ర నిధులు...తెలంగాణకే ముందు!

70 మంది విద్యార్థులకు అస్వస్థత

లారీ–ఆటో ఢీ.. నలుగురి దుర్మరణం

దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలి : మోహన్‌ భగవత్‌

ఆర్టీసీ ఉద్యోగులకు మరో తీపి కబురు!

ఈనాటి ముఖ్యాంశాలు

హుజూర్‌నగర్‌ ఎన్నికతో తేలిపోయింది!

ఎన్‌ఆర్‌సీ అమలుకు అదే తొలి మెట్టు

సచివాలయానికి రాని ఏకైక వ్యక్తి కేసీఆర్‌

నౌహీరా కేసులో కీలక పరిణామం

విషాదం: ఒకే కుటుంబానికి చెందిన..

కేసీఆర్‌ను కలువబోతున్న ఒవైసీ

అవినీతి ఆరోపణలపై ఎస్సై సస్పెండ్‌

‘26 మందిని సస్పెండ్‌ చేసి వచ్చాను’

రేపు యాదాద్రి ఆలయం మూసివేత

కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంఐఎం

అత్యాచారాల్ని కులంతో ముడిపెట్టొద్దు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచకపర్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం

మరో మూడు నెలల్లో రెండేళ్లు

తెల్లజుట్టు బాండ్‌

అంతఃకరణ శుద్ధితో...

హిట్‌ లుక్‌

ద్వితీయ విఘ్నం దాటారండోయ్‌