‘సీఐడీ పనితీరు దారుణం’

29 May, 2018 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలోని కీలక విభాగమైన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) పనితీరు అత్యంత దారుణం గా ఉందని ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సీఎస్‌కు సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల స్కాం కేసులో సీఐడీ విచారణ తీరు, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఫిర్యాదులో స్పష్టం చేశారు.

ఈ స్కాంలో భాగంగా 36గ్రామాల్లో సీఐడీ దర్యాప్తు చేసిందని, ఇళ్లు ఎప్పుడు కట్టారన్న అంశంలో ఇంజనీర్లు తేల్చాలని చెప్పడం ఆ సంస్థ పనితీరు డొల్లతనంగా ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత సీఐడీ వద్ద 242 కేసులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 402 కేసులకు చేరిందని, దీనివల్ల సీఐడీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలేదన్న వాదన వినిపిస్తోందన్నారు. సీఐడీకి ఏటా రూ.కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఏం సాధించారో చెప్పాలన్నారు. ఈ విభాగం పనితీరును సమీక్షించి గాడిలో పెట్టాల్సిన అవసరముందని సీఎస్‌ను కోరారు.

మరిన్ని వార్తలు