సినారెకు కన్నీటి వీడ్కోలు

15 Jun, 2017 00:21 IST|Sakshi
సినారెకు కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్‌: తన కలంతో సాహితీజగత్తును ఓలలాడించిన విశ్వకవనమూర్తి సినారె భౌతిక ప్రయాణం ముగిసింది. మానవుడే ఇతివృత్తంగా ఆవిర్భవించిన ‘విశ్వంభరుడి’కి అశేష జనవాహిని అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. మహా కవిని కడసారి చూసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, సాహితీవేత్తలు, పలు రంగాల ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.

స్వగృహం నుంచి సారస్వత పరిషత్తుకు..
సినారె సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన మనవళ్ల రాక కోసం సినారె పార్థివదేహాన్ని పుప్పాలగూడలోని డాలర్స్‌కాలనీలో ఉన్న స్వగృహంలో ఉంచారు. బుధవారం తెల్లవారుజామున మనవళ్లు ఇక్కడికి చేరుకోవడంతో ఉదయం 8 గంటలకు సినారె అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలు, పోలీసు బ్యాండ్‌తో పుప్పాలగూడ నుంచి బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తుభవన్‌కు చేరుకుంది.

కవులు, రచయితలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సినారె పార్థివదేహాన్ని అక్కడ ఉంచారు. అనంతరం సారస్వత పరిషత్తు నుంచి తిరిగి ప్రారంభమైన అంతిమయాత్ర... నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల మీదుగా మధ్యాహ్నం 1.20 గంట లకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న సీఎం కేసీఆర్, పలు వురు మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకున్నా రు.

మధ్యాహ్నం 1.30 సమయంలో భౌతికాయాన్ని మహాప్రస్థానంలోని ‘మోక్ష స్థల్‌’చితిపై ఉంచారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అధికారికంగా మహాకవికి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు, ఇతర ప్రముఖు లు నివాళి అర్పించారు. 1.45 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకు కడసారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఈ సమయంలో కు టుంబ సభ్యుల రోదనలతో విషాదం అలముకుంది.

చివరిగా హన్మాజీపేట వాసులు, అభిమానులు
తమ ప్రాంతంలో పుట్టి పెరిగిన మహాకవిని చివరిసారి వీక్షించేందుకు సినారె స్వగ్రామం హన్మాజీపేట, వేములవాడ, సిరిసిల్ల, తదితర ప్రాంతాలకు చెందిన వందల మంది అభిమానులు, హైదరాబాద్‌లోని పలు కళాశాలల విద్యార్థులు మహాప్రస్థానానికి తరలి వచ్చారు. తొలుత వారికి సినారె పార్థివదేహాన్ని చూసేందుకు అవకాశం లభించలేదు. అయితే సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి జోక్యంతో పోలీసులు కొంతసేపు అవకాశం కల్పించారు. చివరగా 2.05 గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య, ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

హాజరైన ప్రముఖులు..
అంతకుముందు గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం ఉదయం పుప్పాలగూడలోని నివాసంలో సినారె పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ‘సాక్షి’మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి తదితరులు సినారె పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇక జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వద్ద సినారె అంత్యక్రియలకు ఆయన మనవళ్లు అన్వేష్‌రెడ్డి, క్రాంతికేతన్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని, జగదీశ్‌రెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్, శాసనమండలి విప్‌ బి.వెంకటేశ్వర్లు, ఎంపీ బాల్క సుమన్, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బాబూమోహన్, ప్రకాష్‌ గౌడ్, మర్రి శశిధర్‌రెడ్డి, సాహితీవేత్తలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లతోపాటు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు హాజరయ్యారు.

పోలీసుల అత్యుత్సాహంతో ఇబ్బంది
సీఎం రాక దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసుల అత్యుత్సాహంతో సినారె కుటుంబసభ్యులు, బంధువులకు ఇబ్బంది ఎదురైంది. సినారె పార్థివదేహంతో వచ్చిన వాహనం వెనుక మరో బస్సులో సినారె కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు సహా ఇతర బంధువులు వచ్చారు. అయితే పోలీసులు ఆ బస్సును జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకు అనుమతించకుండా దర్గా చౌరస్తా వద్ద నిలిపివేశారు. దాంతో వారంతా దిగి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై పలువురు బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సినారె ప్రియశిష్యులైన ఆచార్య గోపి వంటి కవులు, ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కవి శివారెడ్డి, ఓల్గా, కుటుంబరావు తదితరులంతా మోక్షస్థల్‌ వరకు వెళ్లలేకపోయారు.

సాహితీలోకం నివాళులు
తెలంగాణ సారస్వత పరిషత్‌ సినారెకు సమున్నతంగా నివాళులర్పించింది. పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, సాహితీవేత్తలు సారస్వత పరిషత్తు వద్ద సినారె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సాహిత్యాన్ని, సినారెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ తన పాటతో సినారెకు నివాళులర్పించారు.

మనవరాలి కన్నీటి కవిత..
సినారె అంతిమయాత్ర ప్రారంభానికి ముందు ఆయన నివాసం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సినారెతో జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సినారె మునిమనవరాలు వరేణ్య తాతపై రాసిన ‘ఓ మైగ్రాండ్‌పా’కవిత చదివి వినిపించింది. అందులో ఆమె తాతపై కురిపించిన ప్రేమానురాగాలను గుర్తుచేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా బాధలో మునిగిపోయారు. సినారె శిష్యుడినని గర్వంగా చెప్పుకునే గజల్‌ శ్రీనివాస్‌ కూడా సినారెపై రాసిన కవితను వినిపించారు. పార్థివదేహాన్ని ఇంట్లో నుంచి తరలిస్తున్న సమయంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సినారె జీవితం, మరణాన్ని కవితగా వినిపించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వృద్ధ దంపతుల దారుణ హత్య

సౌదీ నుంచి స్వదేశానికి..

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

మీ నిర్ణయం అభినందనీయం 

బంగారు కాదు.. బాధల తెలంగాణ 

అన్ని హంగులతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ 

ఆదివాసీలకు అండగా హైకోర్టు 

బీసీ బిల్లు పెట్టాలి 

నేడు విజయవాడకు కేసీఆర్‌

సీబీసీఎస్‌ అమలులో గందరగోళం 

నేటి నుంచి కొత్త బీసీ గురుకులాలు 

అదనంగా 2,660 సీట్లు 

నైరుతి నైరాశ్యం

రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ ఇస్తారా? 

బిల్డర్లూ.. పారాహుషార్‌

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

బీజేపీలోకి జగ్గారెడ్డి..!

ఇంకా మిస్టరీగానే దాసరి ప్రభు అదృశ్యం 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

ఆదివాసీల నిర్బంధంపై హైకోర్టులో విచారణ

శ్రీనివాసరెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

డబ్బుల్‌ ధమాకా

కొడుకు లేని లోటును తీరుస్తున్నాం..

అప్పట్లో ఎన్టీఆర్‌.. ఇప్పుడు మహేశ్‌ బాబు

నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత

అక్టోబర్‌ నాటికి అందాల దుర్గం

వీడలేమంటూ..వీడ్కోలంటూ..

ఆ విశ్వాసం నన్ను ఐపీఎస్‌ స్థాయికి చేర్చింది..

నియామకాలెప్పుడో..!

వరి సాగు అస్సలొద్దు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా