సిటీ  బస్సులను పునరుద్ధరించాలి

4 Dec, 2019 09:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ నుంచి గతంలో నడిచే  సిటీ బస్సులను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరారు. ఓయూ క్యాంపస్‌ నుంచి కోఠిమహిళా కాలేజీ, నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్‌ పీజీ కాలేజీకి, వివిధ ఉద్యోగాల కోసం కోచింగ్‌ సెంటర్లకు విద్యార్థులు బస్సుల్లో వెళ్తుంటారు. అయితే.. క్యాంపస్‌ నుంచి బస్సులు తిరగక పోవడంతో ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.  దూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్‌ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ బస్సులు క్యాంపస్‌ నుంచి వెళ్తుండగా.. లోకల్‌ బస్సులు మాత్రం క్యాంపస్‌ వెనుక నుంచి వెళ్లడం వల్ల విద్యార్థులతో పాటు వివిధ పనుల పై ఓయూ క్యాంపస్‌కు వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  తార్నాక నుంచి కోఠి, నాంపల్లి వెళ్లే 3, 136 నంబర్‌ బస్సులు క్యాంపస్‌ నుంచి వెళ్తూ ఆర్ట్స్‌ కాలేజీ, లా కళాశాల,  లేడీస్‌ హాస్టల్, ఇంజినీరింగ్‌ కాలేజీ ఆంధ్రమహిళా సభ విద్యా సంస్థల బస్‌ స్టాప్‌ వద్ద ఆగేవని, దీంతో విద్యార్థులకు ఎంతో సౌకర్యాంగా ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం క్యాంపస్‌ నుంచి సిటీ బస్సుల రాకపోకలను నిలిపివేసిన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు