టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం

6 Nov, 2018 07:57 IST|Sakshi

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి

హన్మకొండ: టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ భవానినగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ కుటంబసభ్యులకు ఇస్తున్న ప్రా«ధాన్యతల్లో తేడా వస్తోందని, అది అంతర్యుద్ధానికి దారితీసిందన్నారు. ఆ పరిస్థితి నుం చి బయట పడడానికి బావ, బామ్మర్థులు టీడీపీపై దాడి చేస్తున్నారని «ధ్వజమెత్తారు. ప్రజా కూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, ఆ పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ప్రస్పుటంగా కనిపిస్తోందన్నారు.

 ప్రజాకూటమి ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో తగ్గుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఆ పార్టీ నాయకులకు పిచ్చెక్కి అవాకులు, చెవాకులు పేలుతున్నారని చెప్పారు. సామాజిక న్యాయం, రాజకీయ అవకాశాలు టీడీపీతో సాధ్యమయ్యాయని, సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీతోనే మొదలయ్యాయన్నారు. తాను నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ప్రజాకూటమి అవకా శం కల్పిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 2024లో రాజకీయాల నుంచి రిటైర్‌ కావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు జాటోత్‌ సంతోష్‌ నాయక్, షేక్‌బాబాఖాదర్‌ అలీ, హన్మకొండ సాంబయ్య, బొచ్చు పరమానందం, భూక్యా రాజేష్‌ నాయక్, బైరపాక ప్రభాకర్, మార్గం సారంగం తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు