తెలంగాణకు ఐఐఐటీ

27 Jul, 2019 01:23 IST|Sakshi

సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలోనే వచ్చే నెల నుంచి తరగతులు

సాక్షి, హైదరాబాద్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్‌ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్‌ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. వాస్తవానికి కర్ణాటకలోని బెంగళూరులో ఐఐఐటీ ఉంది. దీనికి అదనంగా ఆ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతమైన రాయచూర్‌కు కేంద్ర ప్రభుత్వం మరో ఐఐఐటీని మంజూరు చేసింది. అయితే అక్కడ ఐఐఐటీ విద్యా సంస్థకు భూమి కేటాయించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైంది.

ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామని హెచ్‌ఆర్‌డీశాఖ ముందే సమాచారం ఇచ్చినా కర్ణాటక సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అదునుగా తీసుకొని రెండో ఐఐఐటీకి వెంటనే స్థలం కేటాయిస్తే రాయచూర్‌కు మంజూరు చేసిన ఈ సంస్థను తెలంగాణకు తరలించే అవకాశం లేకపోలేదని హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మంజూరు చేసిన ఐఐఐటీ ఏర్పాటుకు కర్ణాటక తగిన చర్యలు తీసుకోలేకపోయిందని, ఆ కారణంగానే ఈ క్యాంపస్‌ను సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణానికి తరలించాల్సి వచ్చిందని ఆ అధికారి చెప్పారు. అయితే తెలంగాణకు తరలించిన ఐఐఐటీని తాము వెనక్కి తెప్పించుకుంటామని కర్ణాటక బీజేపీ నేతలు అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విధులు మరచి టిక్‌టాక్‌

సామాన్యుల నుంచే ‘టోల్‌’ తీస్తున్నారు! 

చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్‌ బ్యాటరీ

తుప్పుకిక ఓటమి తప్పదు... 

ఆరోగ్యశ్రీ నుంచి 50 వ్యాధులు ఔట్‌! 

తెలంగాణలోనే అమిత్‌ షాకు సభ్యత్వం 

ప్రతిభకు సాయం.. పేదలకు ఊతం

రాష్ట్రంలో పెద్ద పులులెన్ని?

ముహూర్తం.. శ్రావణం!

ఫాం కోల్పోయిన మిలటరీ డెయిరీ

పట్టణాలపై పూర్తి ఆధిపత్యం!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచైనా రేషన్‌ 

చినుకు కునుకేసింది

మా ఊరికి డాక్టరొచ్చిండు

మరో నలుగురు

ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బండి సంజయ్

‘హెక్టారుకు రూ. 50,000  పెట్టుబడి సాయం’

ఈనాటి ముఖ్యాంశాలు

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

‘రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ’

‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు’

తెలంగాణ ‘నయాగరా’

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

‘కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’

వైరల్‌.. గాంధీలో వైద్య విద్యార్థుల టిక్‌టాక్‌

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

మాట్లాడే పుస్తకాలు వచ్చేశాయ్‌!

తొందరొద్దు..   సరిదిద్దుకుందాం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...