నా గెలుపు.. చరిత్రలో నిలిచిపోవాలి

20 Nov, 2018 14:10 IST|Sakshi
నిడమనూరులో మాట్లాడుతున్న సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి

సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి  

సాక్షి, నిడమనూరు (నాగార్జునసాగర్‌): నాగార్జునసాగర్‌లో తన గెలుపు ఉమ్మడి ఏపీలో చరిత్రగా నిలిచిపోవాలని, ఆవిధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి సోమవారం నామినేషన్‌ వేసిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం పదో సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మొదటి సారి అనుభవం లేక, రెండోసారి ప్రయోగానికి పోతే ప్రజలు అర్థం చేసుకోలేక ఓడించారన్నారు. మిగతా అన్ని దఫాలు అఖండ మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగేలా చేశారన్నారు. ఇప్పటికే 7సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి గెలిపిస్తే 8సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన చరిత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కడారి అంజయ్య(టీడీపీ), పొదిల్ల శ్రీనివాస్‌(సీపీఐ), కంచి శ్రీనివాస్‌(టీజేఎస్‌), కాంగ్రెస్‌ నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, యడవెల్లి రంగగశాయిరెడ్డి, చేకూరి హన్మంతరావు, అంకతి సత్యం, మర్ల చంద్రారెడ్డి, శంకర్‌నాయక్, ఉన్నం శోభ, ఉన్నం చినవీరయ్య, వెంకటయ్య, పిల్లి రాజు, పగిల్ల శివ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం కోసం సీట్ల పంపిణీ:
మిర్యాలగూడ : రాష్ట్రంలో ప్రజలకు సామాజిక న్యాయం అందించడానికి మహాకూటమిలో సీట్లు పంపిణీ చేసినట్లు కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పాటు బీసీ సంఘాలు కూడా ఉన్నాయన్నారు. అందరు కలిసి ఆర్‌.కృష్ణయ్యను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, కాంగ్రెస్‌ నాయకులు పగిడి రామలింగయ్య, దైద సంజీవరెడ్డి, కందిమళ్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు