సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు

1 Dec, 2015 01:09 IST|Sakshi
సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు

రాష్ట్ర హోం శాఖ మంత్రి  నాయిని నరసింహారెడ్డి
 ‘మంచిరెడ్డి’  శతచండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు
 
 ఇబ్రహీంపట్నం రూరల్ :
బీడు వారిన నేలలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇబ్రహీంపట్నం ప్రజల కల నేరవేరుస్తారని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్రం, ఇబ్రహీంపట్నం నియోజవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేపట్టిన మహా శత చండీయాగం 6వ రోజుకు చేరింది. ఈ యాగంలో పాల్గొనేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావులు హాజరయ్యారు.
 
  సోమవారం రోజు ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రాతకాల పూజ, చక్రార్చన, అమ్మావారికి అభిషేకం, లక్ష్మీగణపతి జపాలు, అభిషేకం, వేదపారాయణం, నవగ్రహపూజలు, చండీ హోమం, యాగం చేపట్టారు. సాయంత్రం లక్ష బిల్వార్చాన  చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర హోం శాఖ మంత్రినాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి ఆశీర్వాదాలు కావాలంటే ఇలాంటి హోమాలు, యాగాలు అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రం క్షేమంగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్‌లో యాగం చేపడుతున్నరని రని, ఇప్పటికే యాగం ప్రారంభమైందన్నారు.
 
 కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఆర్‌జేడీ వరప్రసాద్‌రెడ్డి, ఏడీఏ వీనరంది, పట్నం ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి, యాచారం జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, నగర పంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, కౌన్సిలర్ ఆకుల యాదగిరి, యాచారం రవిందర్, ఎంపీటీసీ కొప్పు జంగయ్య , ఉప్పరిగూడ సర్పంచ్ పోరెడ్డి సుమతి అర్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, జే రాంరెడ్డి, ప్రసాద్‌గౌడ్, బోసుపల్లి వీరేష్‌కుమార్, మాచర్ల శంకర్‌లతో పాటు వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు .
 

మరిన్ని వార్తలు