రాజన్నను దర్శించుకున్న కేసీఆర్‌ కుటుంబం

30 Dec, 2019 12:35 IST|Sakshi

సాక్షి, వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడ  శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందచేశారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్‌ సమీపంలోని తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి మూడు గంటలకు హైదరాబాద్‌ బయల్దేరతారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ ఉన్నారు.

గోదావరికి జల హారతి
అంతకు ముందు ఆయన సిరిసిల్ల బ్రిడ్జ్‌ దగ్గర కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. అలాగే మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌ను ఆయన పరిశీలించారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా