భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు

28 Mar, 2015 11:52 IST|Sakshi
భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు

భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతుంది. ఎటు చూసినా భక్తజనమే దర్శనమిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాములోరి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.

మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుక శనివారం ఉదయం పదిన్నర గంటలకు  ప్రారంభమైంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేస్తారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు కూర్చొని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా భద్రాద్రి చేరుకున్నారు.  ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములువారికి అందచేశారు.   మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు నవమి వేడుకల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు