మరాఠాల సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్

27 Feb, 2015 17:04 IST|Sakshi

హైదరాబాద్ (సిటీబ్యూరో): మరాఠా ప్రజలకు ఆరాధ్యుడు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వి.వి.శిర్వాద్కర్ జన్మదిన వేడుకలను శుక్రవారం సాయంత్రం జాంబాగ్‌లోని వివేక వర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం వామన్ నాయక్ మార్గ్ జాంబాగ్‌లోని వి.వి.కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు సొసైటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాధ్ గోగ్టె ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా