వేతన సవరణ ఏడాది తర్వాతే..

2 Dec, 2019 02:38 IST|Sakshi

ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్‌

ఏడాది తర్వాత కొత్త వేతనాలను ఖరారు చేస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను ఏడాది తర్వాత పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని అధిగమించి అయినా ఏడాది త ర్వాత కొత్త వేతనాలను ఖరారు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం. గతేడాది ఆర్టీసీ ఉద్యోగులకు 16 శాతం ఐఆర్‌ ప్రకటించారు. వేత న సవరణ గడువు పూర్తై ఏడాదిన్నర గడిచినా అది అమలు కాలేదు. ఇటీవల సమ్మె డిమాండ్లలో అదీ ఓ ప్రధాన అంశమే. అయితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ప్రభుత్వం కూడా సాయం చే యలేదని ముఖ్యమంత్రి గతంలో పదేపదే పేర్కొనడంతో వేతన సవరణపై ఉద్యోగులు ఆశలు వదులుకున్నారు. కానీ ఆదివారం సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే ఈ అంశాన్ని ప్రస్తావించి ఏడాది తర్వాత వేతన సవరణ ఉంటుందని ప్రకటించటంతో వారిలో ఉత్సాహం పెరిగింది.

మళ్లీ సమావేశమై ఫలితాలను విశ్లేషిద్దాం
తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అ మలు చేస్తే ఆర్టీసీ దశ మారుతుందని ప్రకటించిన ముఖ్యమంత్రి... ఆ ఫలితాల విశ్లేషణకు 4 నెలల తర్వాత మళ్లీ ఇదే తరహా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారో వారినే మళ్లీ పిలిచి ఫలి తాలను తెలుసుకొని కలసి భోజనం చేస్తానని వెల్లడించారు. ఆదివారం సమావేశంలో 27 మంది కార్మికులతో సీఎం ప్రత్యేక టేబుల్‌పై భోజనం చే శారు. ఇందులో రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, ఎండీ సునీల్‌శర్మ కూడా ఉన్నారు. వెరసి సీఎంతో కలసి 30 మంది విడిగా మాట్లాడుతూ భోజనం చేశారు. ఈ సందర్భంగా చాలా విషయాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్‌.. అనంతర సమావేశంలో వాటిని ఉటంకిస్తూ ప్రసంగించారు.

జేఏసీలో భాగంగా ఉన్నా ఆమెకు చాన్స్‌
ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నేతృత్వం వహించిన ప్రధా న ప్రతినిధుల్లో సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌కు చెందిన సుధ కూడా కీలకంగా వ్యవహరించారు. అశ్వత్థామరెడ్డి జేఏసీ కన్వీనర్‌గా ఉండగా మిగతా 3 సంఘాల నుంచి ముగ్గురు కో–కన్వీనర్లుగా ఉ న్నారు. వారిలో సుధ కూడా ఒకరు. అయితే సమ్మె కు కారణమైన జేఏసీ నేతలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం వారిని పక్కన పెట్టేశారు. ఆర్టీసీలో వారి జోక్యం లేకుండా చేసే దిశగా సూచనలిచ్చా రు. కానీ సుధ విషయంలో మాత్రం మరో రకం గా వ్యవహరించారు. ఆత్మీయ సమ్మేళనంలో మా ట్లాడాల్సిన అంశాలపై కసరత్తు చేసేందుకు శనివా రం ఉన్నతాధికారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆయన సుధను కూడా ఆహ్వా నించారు. ఆర్టీసీలో సమస్యలు, మహిళా ఉద్యోగు ల ఇబ్బందులపై ఆమెతో మాట్లాడారు. ఆత్మీయ సమావేశంలో కూడా ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి కేసీఆర్‌ ప్రసంగించడం విశేషం.

మరిన్ని వార్తలు