‘సాక్షి’ కార్టూనిస్టు శంకర్‌కు కేసీఆర్ అభినందన

17 Oct, 2014 01:45 IST|Sakshi
‘సాక్షి’ కార్టూనిస్టు శంకర్‌కు కేసీఆర్ అభినందన

సాక్షి, హైదరాబాద్: పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రి అవార్డును కైవసం చేసుకున్న ‘సాక్షి’ కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే ఈ గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాదికి శంకర్‌ను వరించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శంకర్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాలోనే తొలిసారిగా, అది కూడా తెలంగాణకు చెందిన కార్టూనిస్ట్‌కు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు