‘మా ఉద్యోగాలు తొలగించే హక్కు సీఎంకు లేదు’

7 Oct, 2019 03:53 IST|Sakshi
అశ్వత్థామరెడ్డి 

ముఖ్యమంత్రిపై జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి  వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ ఆస్తులపై కన్ను వేసినందునే ముఖ్యమంత్రి దాన్ని ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నారని ఆర్టీసీ కారి్మక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆదివారం ఆరోపించారు. సగం ప్రైవేటు బస్సులు తీసుకునే ఉద్దేశం ఈ కుట్రలో భాగమేనన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు క్రమబద్ధ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందారని, రాజకీయ నేతలు మంత్రులు, చైర్మన్‌లుగా అయినట్టు కాదన్నారు. అలాంటి ఉద్యోగులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులున్నాయని, వాటిని కూలదోసే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. 
(చదవండి : అనుమతి లేకుండా విధుల్లోకి తీసుకోవద్దు)

అందుకే సీఎం నిర్ణయాన్ని తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని, ఇందులో కారి్మకులెవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. తమ సమ్మె న్యాయబద్ధమైనదని, దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్న ఆయన, ఇప్పుడు ప్రజలు తెలంగాణతోపాటు ఆరీ్టసీని కూడా కాపాడుకోవాల్సిన తరుణమొచి్చందన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచన ఈ సమావేశంలో మరోసారి Ðð వెల్లడైందని, కొత్త నియామకాల్లో వచ్చే ఉద్యోగులు కారి్మక సంఘాల్లో చేరొద్దని చెప్పటం దారుణమన్నారు. తమను కారి్మక సంఘాల్లో ఉండొద్దన్నప్పుడు సీఎం రాజకీయ పారీ్టలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. 
(చదవండి : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్‌)

తాము ట్రేడ్‌ యూనియన్‌ను వదిలేస్తే సీఎం రాజకీయపారీ్టని వదులుతారా అని, ఇది తన సవాల్‌ అని పేర్కొన్నారు. ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, వయసులో చిన్నవాడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు. తన తండ్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తరహాలో మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచి్చన హామీకి కట్టుబడి ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తీరును కేసీఆర్‌ గమనించాలని కోరారు. సోమవారం తాము ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని సిద్ధం కాగా, ఇప్పుడు అనుమతి లేదంటున్నారని, అదే సమయంలో తాము తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులరి్పంచి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా