ఏఎన్‌ఎం జీతాల పెంపు 

5 Feb, 2018 02:53 IST|Sakshi

రూ.10 వేల నుంచి రూ.21 వేలకు పెరిగిన జీతాలు 

ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఏఎన్‌ఎంల జీతాలను పెంచు తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు వారి జీతాలను రూ.10 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ఆదివారం ఫైలుపై సంతకం చేశారు. 2003లో యూరోపియన్‌ కమిషన్‌ ప్రాజెక్టు కింద 710 మంది ఏఎన్‌ఎంలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వారి నెల జీతం రూ.10 వేలుగా ఉంది. ఈ నేపథ్యంలో వారి జీతాలను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఫైలుపై సంతకం చేశారు.

మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఇటీవల సీఎంను కలసి సెకండ్‌ ఏఎన్‌ఎంల జీతాలు కూడా పెంచాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. వారి జీతాలను పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు