అల్ల నేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్‌

25 Jun, 2020 13:10 IST|Sakshi

సాక్షి, మెదక్‌: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్ల నేరేడు మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 15 కోట్లుతో నిర్మించిన అర్బన్‌ పార్కును సీఎం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు నర్సాపూర్ కు రోడ్డు మార్గాన సీఎం చేరుకున్నారు. రాష్ట్ర వ్యాపితంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. గత ఐదేళ్ల నుంచి 182 కోట్ల మొక్కలు నాటగా, ఈ సారి 48 కోట్ల  మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల పెంపకం పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ఒక యజ్ఞంలాగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు