ముగిసిన కేసీఆర్‌ సమీక్ష.. మరికాసేపట్లో కీలక ప్రకటన!

6 Oct, 2019 20:08 IST|Sakshi

రవాణ శాఖ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష సమావేశం

మరికాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని‍ర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అధికారులతో చర్చించిన సీఎం పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సమ్మె ప్రభావం ఏ విధంగా ఉందని సీఎం ఆరా తీశారు. అయితే ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం మరికాసేపట్లో  కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో  ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న అంశం ఉత్కంఠగా మారింది. కాగా కార్మికులపై ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పండుగ నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరైనవి కావని ప్రభుత్వం అసహనం వ్యకం చేసింది.

సమ్మె నేపథ్యంలో శనివారం సాయంత్రంలోగా విధులకు హాజరుకావాలని​ ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. హాజరుకాకపోతే వారందరిని ఆర్టీసీ సిబ్బందిగా గుర్తించేది లేదని హెచ్చరికలూ జారీ చేసింది. అయినా కూడా కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో ఆదివారం నాడు రవాణా శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం పలుమార్లు కార్మికులను కోరింది. అయినా పట్టువీడని ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో పండుగ వేళ ప్రయాణికులకు  ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లును చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా