విద్యుత్ ‘ఉద్యోగుల’ క్రమబద్ధీకరణను పరిశీలించండి

2 Dec, 2016 02:24 IST|Sakshi
విద్యుత్ ‘ఉద్యోగుల’ క్రమబద్ధీకరణను పరిశీలించండి

ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్ కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులందరినీ దశల వారీగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకా శాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలు తక్షణమే సమ్మె పిలుపును ఉపసంహరించుకుని శుక్ర వారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో చర్చల కు రావాలని పిలుపుని చ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమ స్యలపట్ల ప్రభుత్వం తొలి నుంచీ సానుకూ లంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించు కునే అవకాశముందని, సమ్మెలు అవసరం లేద న్నారు. రాజకీయ కారణాలతో చేసే సమ్మెలో భాగస్వాములు కారాదని సూచిం చారు.

సమ్మె ఉపసంహరణ ప్రకటన జరిగిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులను చర్చ లకు పిలవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా, సంతృప్తిగా ఉం డాలని, ఆరోగ్యకరమైన తెలంగాణ లక్ష్యమని సీఎం చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యో గుల డిమాండ్లను ట్రాన్‌‌సకో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు ముఖ్య మంత్రి దృష్టికి తెచ్చారు.

సబ్ స్టేషన్లు, లైన్లు, విద్యుత్ ప్లాంట్లు, కార్యాలయాల నిర్వహణ లాంటి కీలక విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారని, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ ఉందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో విద్యుత్ శాఖకు ఏళ్లుగా సేవలందిస్తున్నారని, అనుభవం కూడా గడించారన్నారు. అందువల్ల వారి డిమాండ్‌ను మానవతా కోణంలో పరిశీలించి దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలని సీఎం పేర్కొన్నారు.

దీనికి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గతంలో విద్యుత్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేత నాలు భారీగా పెంచామని, అదే తరహాలో అన్ని సమస్యలు పరిష్కరిం చేందుకు ప్రభు త్వం సానుకూలంగా ఉందని సీఎం ప్రకటిం చారు. సమావేశంలో జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, సీఎంవో కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు