‘మూసీ’పై అవసరమైన చర్యలు తీసుకోండి 

7 Oct, 2019 03:47 IST|Sakshi
ఆదివారంమంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మూసీ ప్రాజెక్టు పరిశీలిస్తున్న స్మితా సబర్వాల్‌

ప్రాజెక్టు పరిశీలనకు స్మితా సబర్వాల్, ఈఎన్‌సీని పంపిన సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మూసీ ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. ఆదివారం ఉదయం మూసీ గేటు ఘటన పరిస్థితుల తీవ్రతను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంకు ఫోన్‌లో వివరించారు. దీంతో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు ఈఎన్‌సీ మురళీధర్‌రావులను మూసీ సందర్శించి, తక్షణ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌తో పాటు ఇంజనీర్లు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మూసీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. 

స్టాప్‌లాగ్స్‌ బిగింపునకు 3 రోజులు 
అధికారులు మూసీ వద్దకు చేరుకున్నాక అక్కడి పరిస్థితిని సీఎంకు ఫోన్‌లో వివరించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎక్కువగా ఉండటం, గేటు ఊడటంతో 10వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తోందనీ,, దీన్ని నిరోధించేందుకు స్టాప్‌లాగ్స్‌ అవసరమనీ తెలిపారు. వాటిని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) అధికారులు డిజైన్స్‌ రూపొందించి తయారు చేయించేందుకు కనీసం మూడు రోజులైనా పట్టవచ్చని వివరించినట్లు తెలిసింది. 

అప్పటిలోగా ప్రాజెక్టులో ఉన్న నీరంతా ఖాళీ అయ్యే అవకాశాలే అధికమని ఇంజనీర్ల అంచనా. ఒకవేళ ప్రైవేటు కాంట్రాక్టర్లకు గేటు అమర్చే పని అప్పగించినా మూడు రోజులు పడుతుందని భావిస్తున్నారు. గేటుకు ఒక పక్కభాగంలో కాంక్రీట్‌ నిర్మాణం దెబ్బతినడం, ఎగువన నుంచి భారీగా వచి్చన వరద ప్రవాహంతో అది విరిగిపోయినట్లు తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండుగపూట తడిసి ముద్దయిన నగరం

మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో

కేన్సర్‌ ముందే గుర్తిస్తే 90 శాతం సేఫ్‌

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

సగం ప్రైవేటీకరించినట్టేనా...?

రెండోరోజూ అదేతీరు

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్‌

‘ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కుట్ర’

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం

ఎల్‌బీ నగర్‌లో వరద.. మహిళను కాపాడిన యువకుడు

రేపటి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ

ముగిసిన కేసీఆర్‌ సమీక్ష.. మరికాసేపట్లో కీలక ప్రకటన!

ఈనాటి ముఖ్యాంశాలు

సెల్‌ టవర్‌ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్‌ నిరసన

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

సమ్మెపై వాడీవేడి వాదనలు.. కీలక ఆదేశాలు

ఆర్టీసీ సమ్మె: రాత్రి 11.30 వరకు మెట్రోరైళ్లు..!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసుల లాఠీచార్జ్‌

విరిగిన మూసీ గేట్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష

సిద్దిపేటలో విషాదం.. మంత్రి హరీశ్‌ దిగ్భ్రాంతి

రాజేంద్రనగర్‌లో ఘోరరోడ్డుప్రమాదం!

అధిక చార్జీల వసూలుపై కొరడా.. కేసులు నమోదు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఈఎస్‌ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్‌

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది..

కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి

ఆర్టీసీ సమ్మెపై హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

విధులకు రాంరాం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!