అన్నింటి కన్నా విద్యుత్‌శాఖ నంబర్‌ వన్‌: కేసీఆర్‌

10 Oct, 2019 16:35 IST|Sakshi

పల్లెప్రగతి విజయవంతమైంది

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణవ్యాప్తంగా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో జరిగిన ‘పల్లెప్రగతి’ దిగ్విజయం సాధించిందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని గ్రామాల్లో పవర్‌ వీక్‌ నిర్వహించి విద్యుత్‌ సంబంధిత సమస్యల పరిష్కరించడంలో విద్యుత్‌శాఖ అద్భుతంగా పనిచేసి, అన్నిశాఖలకన్నా నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు, గ్రామ కార్యదర్శలు, సర్పంచ్‌లకు సీఎం అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు. గ్రామాల అభివృద్ధికి నెలకు 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, మంత్రులు, డీపీఓలు, డిఎల్‌పిఓలు, ముఖ్య కార్యదర్శుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా