నేడు ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష

6 Oct, 2019 04:56 IST|Sakshi

గైర్హాజరైన ఉద్యోగులపై నిర్ణయం తీసుకునే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి శనివారమే సమీక్ష ఉందన్న సమాచారంతో అధికారులు ప్రగతిభవన్‌కు చేరుకున్నాక, ఆదివారానికి వాయిదే వేసినట్లు ప్రకటించారు.  సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇలా సమ్మెలు జరిగినప్పుడల్లా ఇబ్బందులు ఏర్పడటం, ప్రత్యామ్నాయ చర్యలకు సమస్యగా ఉం డటంతో దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని భావిస్తున్నారు.

ఇప్పటికే ఆయన ఈ విషయంలో నిపుణులతో మాట్లాడినట్లు సమాచారం. సమ్మెలో పాల్గొనే ఆర్టీసీ ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఇప్పటికే నిర్ణయించారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హాజరైనవారు తప్ప మిగతా వారిని డిస్మిస్‌ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ గడువులోగా డ్రైవర్లు, కండక్టర్లు హాజరు కాలేదు. సూపర్‌వైజరీ కేడర్‌ అధికారులు కూడా సమ్మెకే పరిమితమయ్యారు. హెచ్చరిక ప్రకారం.. సమ్మెలో ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారా లేదా మరో గడువు నిర్ధారిస్తారా అన్నది తేలలేదు.

శనివారం రాత్రి వరకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి సమీక్షలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వారిపై చర్యల విషయంలో న్యాయపరమైన సలహా తీసుకుంటోందని, ఒక్కసారే దాదాపు 55 వేల మందిపై చర్యలు తీసుకుంటే న్యాయపరమైన పర్యవసానాలపై మాట్లాడినట్లు సమాచారం. వీలైనన్ని అద్దె బస్సులు తీసుకునే దిశగా అధికారులకు సూచనలు అందినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సుల పరిమితి 25 శాతంగా ఉంది. మొత్తం బస్సుల్లో 25 శాతం మేర అద్దె బస్సులు ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ పరిమితిని భారీగా పెంచే అవకాశం ఉంది. దీంతో ఆదివారం నాటికి ఆ బస్సులు మరిన్ని పెరగనున్నాయి. శనివారం ఈ అద్దె బస్సుల వల్లే ప్రయాణికులకు కొంత ఊరట కలిగింది. మరి ఈ బస్సుల పెంపుపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. మరో 3 నుంచి 4 వేల బస్సులను అద్దెకు తీసుకుని నడపాలని భావిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శని వారం ప్రకటించారు.  6 వేల నుంచి 7 వేల ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు విధులకు రాని వారిని భవిష్యత్తులో కూడా ఉద్యోగులుగా పరిగణించబోమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె శాశ్వత  పరిష్కారాలపై దృష్టి పెట్టాలి

పల్లె సీమలో ప్రగతి సీను

రబీకి 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

విద్యుత్‌ ఉద్యోగుల విభజన పూర్తి 

ఎస్మా అంటే కేసీఆర్‌ ఉద్యోగాన్నే ప్రజలు తీసేస్తరు

సమ్మె తీవ్రం.. సర్కారు ‘చక్రం’

ఈఎస్‌ఐ స్కాంలో ఫార్మా కంపెనీ ఎండీ అరెస్ట్‌ 

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు 

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు

కారుతో ఢీకొట్టి మహిళ కిడ్నాప్‌ 

గొడవపడిన భర్త..కాల్‌గర్ల్‌ పేరుతో భార్య ఫొటో పోస్టు

త్వరలోనే పాసుపుస్తకాలు 

పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక ప్రగతి

వేలిముద్ర పడదే..! 

విరిగిన మూసీ ప్రాజెక్టు గేటు

కాళేశ్వరానికి సాయం చేయండి

రవిప్రకాశ్‌ అరెస్ట్‌...

'ఇండియా డే వేడుకల్లో' టాక్ తెలంగాణ

రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశాం: డీసీపీ

విరిగిపోయిన మూసీ గేటు..

చట్టబద్దంగా సమ్మెకు దిగితే బెదిరింపులా?

ఈఎస్‌ఐ స్కామ్‌ : నిందితులకు రెండురోజుల కస్టడీ

ఈనాటి ముఖ్యాంశాలు

జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆర్టీసీ​ కార్మికులకు మరో అవకాశం!

ప్రగతి భవన్‌ నుంచే ఆపరేషన్‌ ఆర్టీసీ!

ఆసక్తికరం; గవర్నర్‌తో చిరంజీవి భేటీ

తొలగించాలనుకుంటే నన్ను తీసేయండి

సమ్మెపై మంత్రి ఆగ్రహం.. కుట్రవారిదే!

‘ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!