‘ప్రభుత్వం చెప్పిన పంటలనే రైతులు సాగుచేయాలి’

12 May, 2020 20:10 IST|Sakshi

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : రైతుల ఆలోచనలో నిర్మాణాత్మకమైన మార్పులు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు పంటలు వేసి మార్కెట్‌కు తీసుకురావొద్దన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగుచేయాలని కోరారు. పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటలు సాగుచేయాలన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్‌కు తీసుకొస్తే ఎవరూ కొనరని, డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు. ఏ పంటలు వేస్తే రైతులు లాభపడతారో ప్రభుత్వమే చెబుతుందన్నారు. విత్తనాలు కూడా ప్రభుత్వం  నిర్ణయించిన పంటలకు మాత్రమే అమ్మాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో కొత్తగా సీడ్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ విషయాలపై మే 15న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు