త్వరలో రైతులకు శుభవార్త..

30 May, 2020 01:56 IST|Sakshi

ఆ వార్త విని దేశమే అబ్బుర పడుతుంది

సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్య

సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో రైతులకు శుభవార్త వినిపిస్తా. ఆ వార్త విని దేశమే అబ్బుర పడుతుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ సాగును లాభదాయకం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుం టోందన్నారు. ఇప్పటికే రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని, ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు రూ. వందల కోట్ల విద్యుత్‌ ఖర్చవుతుందని, అయినా రైతులపై ఒక్క రూపాయి కూడా నీటి తీరువా విధించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతులకు చేయూతనిస్తున్నామని చెప్పారు. నియంత్రిత సాగు విధానంతో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం కానున్నారన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత చిత్తశుద్ధి్దతో ముందుకెళ్తుందన్నారు. రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంటుందని... ఆ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. అంతవరకు సస్పెన్స్‌గా ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. 

>
మరిన్ని వార్తలు