వానాకాలం వ్యవసాయంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

18 May, 2020 04:40 IST|Sakshi

నేడు కలెక్టర్లు, వ్యవసాయాధికారులతో సమావేశం 

ఏఈవోల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌లో వ్యవసాయ సన్నద్ధతపై సీఎం కేసీఆర్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు మొదలు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొననున్నారు. అలాగే ఉద్యాన, మార్కెటింగ్‌ జిల్లా ఉన్నతాధికారులు, మార్క్‌ఫెడ్‌ మేనేజర్లు, ఆగ్రోస్‌ రీజనల్‌ మేనేజర్లు, విత్తన కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్లు, జిల్లా సహకారశాఖ అధికారులు, రైతుబంధు సమితి గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం కానుంది. కాన్ఫరెన్స్‌ ఎజెండా అంశాలను వ్యవసాయశాఖ ఆదివారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు అందజేసింది.  

ఎజెండా అంశాలు ఇవే... 
గ్రామాలు, మండలాల వారీగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగు చేయాల్సిన వరి, మేలు రకం విత్తనాలు }
గ్రామాలు, మండలాలవారీగా మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటల సాగు, ∙గ్రామాలు, మండలాలవారీగా కంది పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు అవకాశాలపై సలహాలు
గ్రామాలు, మండలాలవారీగా పత్తి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు గల అవకాశాలపై చర్చ
ఆయిల్‌పామ్, నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి అనుకూలమైన మండలాలు, గ్రామాల వారీగావివరాలు ∙పచ్చిరొట్టను ప్రోత్సహించడంపై
వివిధ రకాల పంటలకు సంబంధించి అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు
నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
ఎరువుల సరఫరా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ఎంత?
జిల్లాలు, మండలాల వారీగా పంటల మ్యాపింగ్‌  

మరిన్ని వార్తలు