'ప్రతి కలెక్టర్ వద్ద రూ. 10 కోట్ల నిధి'

17 Apr, 2015 16:31 IST|Sakshi
'ప్రతి కలెక్టర్ వద్ద రూ. 10 కోట్ల నిధి'

హైదరాబాద్: ప్రతి నెలలో ఓ రోజును అర్బన్ డే, మరో రోజును రూరల్ డే గా పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ప్రతి ఇంటికి  టాయిలెట్ నిర్మాణం, పరిశ్రుభ్రంగా ఉండే గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంట్ అందజేశేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ పట్టణాల్లో వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందాలని... అలాగే అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. జిల్లాల్లో అత్యవసర నిధి కింద ప్రతి కలెక్టర్ వద్ద రూ. 10 కోట్ల నిధి ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు