500 ఎకరాల్లో హార్టీకల్చర్ వర్సిటీ: కేసీఆర్

8 Aug, 2014 20:48 IST|Sakshi

మెదక్‌: గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. 500 ఎకరాల్లో ఫారెస్ట్‌ వర్సిటీ, మరో 500 ఎకరాల్లో హార్టీకల్చర్ యూనివర్సిటీ నెలకొల్పుతామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. 

75 ఎకరాల్లో హాస్టళ్లు, ఆఫీసు రూముల ఏర్పాటు చేస్తామని, దీనంతటికి రూ. వెయ్యి కోట్లు అవసరమవుతుందని తెలిపారు. రూ.200 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయరని, వారం రోజుల్లో తానే శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు