ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఘాటు హెచ్చరికలు

7 Jun, 2018 22:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మెనోటీసులు ఇవ్వడం బాధ్యతారాహిత్యం అని అన్నారు. ప్రభుత్వాన్ని కాదని సమ్మెలో పా‍ల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగాలను పోగొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే సమ్మెకు వెళ్లాలంటూ వ్యాఖ్యానించారు. 

సమ్మె జరిగితే ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మె అవుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. యూనియన్‌ నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దని హితవుపలికారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీలో 44శాతం జీతాలు పెంచామని గుర్తు చేశారు. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి రెండేళ్ల సమయం ఇచ్చినా ఎలాంటి ఫలితంలేదని మండిపడ్డారు. ఇకపై ఆర్టీసీలో సమ్మెను నిషేధించామని సీఎం చెప్పారు. ఇకనైనా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలంటూ సూచించారు.

మరిన్ని వార్తలు