సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు

3 Jun, 2016 01:35 IST|Sakshi

తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు
టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి

 

హన్మకొండ : సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) జిల్లా అధ్యక్షురాలు బి.రమాదేవి విమర్శించారు. గురువారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ‘మాటలకు చేతలకు పొంతనలేని కేసీఆర్ రెండేళ్ల పాలన’ పేరిట పుస్తకాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సీఎం విధానాలవల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, దళి తులు, సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు.


రైతు ఆత్మహత్యలు లేని, ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు వీరబ్రహ్మాచారి, నల్లె ల రాజయ్య, అనిల్, కళ, బాలరాజు, జనగామ కుమారస్వామి, సదానందం, అమరేందర్, ఉమాదేవి, రాజు, రాకేష్, మదుసూధన్, భా రతి, అనంతుల సురేష్, గద్దల సంజీ వ, భిక్షపతి, మంద సంజీవ పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు