సీఎం పర్యటన రద్దు

22 Jan, 2015 05:16 IST|Sakshi
సీఎం పర్యటన రద్దు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన రద్దయ్యింది. గురువారం ఆయన హైదరాబాద్‌కు నుంచి కామారెడ్డికి హెలిక్యాప్టర్ ద్వారా చేరుకొని వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆదిలాబాద్ జిల్లాకు వె ళ్లాల్సి ఉంది. ఈ మేరకు ముఖ్యమం త్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి కె.వెంకటనారాయణ కలెక్టర్, ఎస్‌పీ తదితర ఉన్నతాధికారులకు బుధవారం సాయంత్రం సమాచారమందించారు. అయితే, చివరి నిమిషంలో సీఎం కామారెడ్డి పర్యటన రద్దయినట్లు సీఎంఓ నుంచి రాత్రి అత్యవసర సమాచారం వచ్చింది.

అంతకు ముందు కేసీఆర్ పర్యటన కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నాలుగైదు రోజులుగా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, విద్య, వైద్య ఆరోగ్య, గృహ నిర్మాణ, వ్యవసాయ తదితర శాఖలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ రొ నాల్డ్‌రోస్, ఎస్‌పీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారుల తో సమీక్ష సమావేశాలు కూడ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉ దయం 10.45 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పా టు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకోవాల్సి ఉంది. డిగ్రీ కళాశాల ఆవరణలో హె లిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ది, జిల్లా ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపేందుకు వీలుగా పార్శి రాములు కళ్యాణమండపంలో ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సీఎం పర్యటన రద్దయినట్లు సమాచారమందింది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం, ఉన్నతాధికారుల సమీక్షలతో బిజీబిజీగా గడిపిన సీఎం, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో పర్యటన రద్దు చేశారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు