ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి

28 Feb, 2017 13:02 IST|Sakshi
హన్మకొండ: ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి అన్నారు. హన్మకొండ సుబేదారిలోని వరంగల్‌ క్లబ్‌లో నూతనంగా రూ.12 లక్షలతో నిర్మించిన టెన్నిస్‌ కోర్టును సోమవారం వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అమ్రపాలి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎంతో బిజీగా ఉంటున్న వారు దొరికిన కాస్త సమయంలో క్రీడలు ఆడటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఆటల ద్వారా పని ఒత్తిడిని మరచిపోతామన్నారు. ఆరోగ్యానికి వరంగల్‌ క్లబ్‌ ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమన్నారు. 
 
పోలీసు కమీషనర్‌ సుధీర్‌బాబు మాట్లాడతూ వరంగల్‌ క్లబ్‌లో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ టెన్నిస్, షటిల్, జిమ్, స్విమ్మింగ్‌ ఫూల్‌ వంటివి ఏర్పాటు చేసి సభ్యులకు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు కొద్ది సేపు టెన్నిస్‌ ఆడారు. కార్యక్రమంలో వరంగల్‌ క్లబ్‌ కార్యదర్శి గండ్ర సత్యనారాయణరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ దొంతు రవీందర్‌రెడ్డి, సభ్యులు నారాయణరెడ్డి, డాక్టర్‌ రమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి, మదన్‌మోహన్, మొగుళ్ల శ్రీనివాస్, కమల అగర్వాల్, ఎర్రగట్టు స్వామి, ప్రభాకర్‌రావు, ప్రొద్దుటూర్‌ రవీందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  
 
అదే విధంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 40 మంది యువకులు తాను సినిమాలో రచించిన ఒకటే జననం...ఒకటే మరణం అనే గేయాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఇటీవల రక్షణ శాఖలో ఎంపికయ్యారని ఆయన ఈ సందర్భం గా గుర్తు చేశారు. కార్యక్రమంలో సామాజికవేత్త, స్వర్ణలత, కవి హరగోపాల్, సర్పంచ్‌ బొంగు శ్రీశైలం, ఫౌండేషన్‌ వ్యవస్థాపక సభ్యురాలు, గాయని రచ్చ భారతి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు