కలెక్టరే నిర్ణేత

23 Aug, 2014 03:54 IST|Sakshi
కలెక్టరే నిర్ణేత

 ప్రగతినగర్ :  కలెక్టరెట్‌లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో  శుక్రవారం సాయంత్రం నీటి సలహాబోర్డు సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్యెల్యేలు షకీల్, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ  అరికెల నర్సారెడి, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5.09 టీఎంసీల నీరు నిలువకు పోగా, తాగు నీటికి  రెండు టీఎంసీలు కేటాయిస్తారు.

 మిగితా నీటిని వృథాపోకుండా, పంటల కనుగుణంగా సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇస్తున్నట్లు మొదటి తీర్మానం చేశారు. అదేవిధంగా అలీసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి 0.8 టీఎంసీల నీటి ని వ్యవసాయానికి విని యోగించుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ  2వ తీర్మానం, గుత్ప ఎత్తిపోతల నుంచి అవకాశం ఉన్నం త వరకు నీటిని  వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి 3వ తీర్మానం, కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి అవసరానికనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కలెక్టర్‌కు అధికారం ఇస్తూ 4వ తీర్మానాన్ని బోర్డు ఆమోదిం చింది.

 క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించాలి  - మంత్రి పోచారం
 అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా వివరాలు సేకరించాలని, ఆదర్శరైతుల రిపోర్టులపైనే ఆధారపడడం మానుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ, సహాయ వ్యవసాయాధికారులు, ఉపసంచాలకులు పంటల విస్తీర్ణాన్ని పరిశీలించాలన్నారు. వ్యవసాయ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు సమాచార సేకరణకు స్వయంగా  కృషి చేయాలని మంత్రి సూచించారు. సాగు చేస్తున్న పంటలకు విద్యుత్ ఏమేరకు అందించాలో నిర్ణయించాలని, పంటలను కాపాడడానికి రైతులకు చేయూతనందించాలన్నారు.

పంటనష్టం, పంటరుణాల నిధులు ఎట్టిపరిస్థితుల్లోను దుర్వినియోగం కాకూడదన్నారు.  రాష్ట్రానికి 2400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 1400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని, పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయ పంటలు కాపాడడానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. 2009 నుంచి 2014 వరకు
పంటనష్టం పరిహారం కింద 482.52 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తద్వారా 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.  జిల్లాలో  51 వేల మంది రైతులకు  20.06 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు.  జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్‌షిండే మాట్లాడుతూ 300 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మండలానికి విడుదలచేయాలని కోరారు.

నియోజక వర్గంలో తీవ్ర వర్షభా వ పరిస్థితులు తట్టుకొని రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి ఈనీరైన ఉపయోగపడుతుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఆద ర్శ రైతుల నుంచి వీఆర్‌ఓలు వారి ద్వారా వ్యవసా య అధికారులు  వివరాలను సేకరించడం ద్వారా  సరైన పద్ధతిలో  న్యాయం జరుగడం లేదన్నారు.  దీని ద్వారా  అర్హులకు  అన్యాయం జరుగుతుందని షకీల్ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో  ఇబ్బందులు ఏర్పడుతున్నం దున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  సమావేశంలో సహకార బ్యాంకు చైర్మన్ గంగాధర్‌పట్వారి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక  ఇంజనీర్ షకీల్ ఉర్ రహమాన్, జేడీఏ నర్సింహ, ఆర్‌డీఓలు యాది రెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు