వారం రోజుల్లోపు కందుల డబ్బులు

25 Mar, 2018 08:41 IST|Sakshi
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నజిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

అన్ని శాఖల అధికారులతో సమీక్ష

శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారం

కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

అన్ని శాఖల అధికారులతో సమీక్ష

గుడిహత్నూర్‌(బోథ్‌) : వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. కంది రైతులకు చెల్లించాల్సిన రూ.94 కోట్లు జిల్లాకు చేరాయని, వారంలోగా చెల్లిస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వచ్చే మూడు నెలల్లో జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చాలనే సంకల్పంతో సిబ్బంది పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో జిల్లా అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో వెనుకబడి ఉందని తెలిపారు. అంగన్‌వాడీలు, ఉపాధి సిబ్బంది వారి వారి పరిధిని దత్తత తీసుకుని మరుగుదొడ్లు నిర్మిస్తే వారికి పారితోషికం అందిస్తామని తెలిపా రు. అనంతరం శాఖల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీవో పీడీ రాజేశ్వర్‌రాథోడ్, డీఎంఅండ్‌హెచ్‌వో రాజీవ్‌రాజ్, జెడ్పీ సీ ఈవో జితేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారులు డాక్టర్‌ మనోహర్, సాధన, ఇచ్చోడ ఏఎంసీ చైర్మన్‌ ఆడే శీల, ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, జెడ్పీటీసీ కేశవ్‌ గిత్తే, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్, తహసీల్దార్‌ అర్క మోతీరాం, ఎంపీడీవో పుష్పలత, ఎంఈవో నారాయణ, ఏవో మహేందర్, ఎంవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు