సిరిసిల్ల: ప్రలోభాల పర్వం 

5 Dec, 2018 15:22 IST|Sakshi

మద్యం, మనీతో ఓటర్లకు ఎర 

ప్రచారానికి మిగిలింది గంటల సమయమే..

నేటిసాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి పుల్‌స్టాప్‌

జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మనీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడికక్కడ ఓటు లెక్కన ముట్టజెప్పడానికి అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటిసాయంత్రం నుంచి పోలింగ్‌ రోజువరకు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. దీంతో ముందస్తు వ్యూహంతో భారీ స్థాయిలో మద్యం నిల్వలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం, డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల అధికారులు, పోలీస్‌ యంత్రాంగం పటిష్ట నిఘా ఉంచినా.. యంత్రాంగం కళ్లుగప్పి తమపని తాము చేసుకుపోవడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నట్లు సమాచారం. 


సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో అభ్యర్థుల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత మైకులు, ప్రచారాలు, ప్రసంగాలు ఉండరాదని, ప్రచారం కోసం వచ్చిన బయటి వ్యక్తులు సైతం సాయంత్రానికల్లా నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ప్రచారపర్వం తర్వాత, పోలింగ్‌ సమయానికి ముందున్న 48 గంటల పాటు జిల్లాలో ప్రలోభాల పర్వం జోరుగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరెండు రోజుల్లో చీకటిమాటున పెద్దఎత్తున ఓటర్లను డబ్బు, మద్యంతో ఎరవేసి ప్రలోభపర్చుకోవడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. 

నిఘా కళ్లు గప్పి..
జిల్లాలోని కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్తపడి ముందస్తుగానే తమ నియోజవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండలస్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మహిళా ఓటర్లకు ఎర..
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జనసమీకరణలో మహిళలనే భారీసంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబ ట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదర్యాన్ని ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గు ప్పిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘా ల గ్రూపులకు ఒక్కో బృందానికి రూ.30 వేల చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు