కలిపి కొడదాం..

18 May, 2020 04:17 IST|Sakshi

‘కాంబినేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌’తో కరోనా చికిత్సకు అవకాశాలు?

హాంకాంగ్‌లో రెండో దశ ప్రయోగాలు విజయవంతం

లాన్సెట్‌ జర్నల్‌లో అధ్యయన వివరాలు ప్రచురణ

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వైద్య నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేలోగానే వివిధ మందులతో కూడిన ‘కాంబినేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌’ చికిత్సకు ప్రాధాన్యం ఏర్పడవచ్చనే చర్చ వైద్య, పరి శోధన వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ల తయారీ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పూర్తి ఫలితాలు వెలువడి.. టీకాల ఉత్పత్తికి కనీసం ఏడాదిపట్టే అవకాశాలున్నాయి. ఆలోపే వివిధ మందులతో కూడిన చికిత్స విధానానికి సంబంధించి మనుషులపై ప్రయోగాలు విజయవంతమైతే కాంబినేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌ థెరపీ అందుబాటులోకి రావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే వివిధ వైరస్‌లు, వ్యాధు లకు ఉపయోగించిన రెండు–మూడు మందుల్ని కలిపి ఉపయోగించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండ దని, అసలు వైరస్‌ సోకకుండా అండగా నిలిచే వ్యాక్సిన్లతోనే మంచి ఫలితాలొస్తాయని ఇంకొం దరు చెబుతున్నారు. అదీగాక కరోనా పేషెంట్లపై మందుల ప్రయోగాన్ని పరిమితంగా అంటే వందలలోపు నిర్వహించినందున, ఈ పరిశోధ నలను ఏ మేరకు ప్రామాణికంగా తీసుకోవచ్చనేది కూడా ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడుతున్నారు.

మంచి ఫలితాలే వచ్చాయి!
కరోనా పేషెంట్లు వేగంగా కోలుకునేందుకు యాం టీ వైరల్‌ డ్రగ్స్‌ (ఇప్పటికే వివిధ చికిత్సలకు ఉప యోగించినవి) ఉపయోగపడుతున్నట్టు కెనడాకు చెందిన పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా చేయొచ్చని అభి ప్రాయపడుతున్నారు. ఈ అధ్యయన వివరాలను ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ జర్న ల్‌లో ప్రచు రించారు. ఈ చికిత్సలో ఇంటర్‌ఫెరాన్‌ మందు ఉపయోగించినపుడు మంచి ఫలితాలే వచ్చాయని (ఈ మందును కొన్నేళ్లుగా ఇతర రోగాల చికిత్సకు వాడుతున్నారు) కెనడాలోని వర్సిటీ ఆఫ్‌ టొరంటో పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా చైనా హువాన్‌లోని 77 మంది కరోనా  పేషెంట్లపైనా ఈ మందు ప్రభావాన్ని అంచనా వేసినట్టు పేర్కొన్నారు.

కొంతమందిపై పరీక్షలు నిర్వహించినా కరోనాకు సంబంధించి తదుపరి చికిత్సలకు, సంబంధిత ముఖ్యమైన అం శాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు ఉప యోగపడతాయని వారంటున్నారు. మరో వైపు హాంకాంగ్‌లో ఫిబ్రవరి 10 – మార్చి 20 మధ్యలో 127 మంది పేషెంట్లపై.. అందులో 86 మందిపై కాంబినేషన్‌ గ్రూప్, 41 మందిపై కంట్రోల్‌ గ్రూప్‌గా నిర్వహించిన రెండో దశ ›ప్రయోగాలు విజయవంతం కావడం, ఈ చికిత్స పద్ధతిపై ఆశ లను రేకెత్తిస్తున్నట్టు పరి శోధకులు వెల్లడించా రు. ఇంటర్‌ఫెరాన్‌ బేటా–1బీ, లోపినవిర్‌–రిటినో విర్, రిబవిరిన్‌ మందులను కాంబినేష న్‌గా ఉపయోగించి నపుడు మంచి ఫలితాలొ చ్చాయని వారు తెలిపారు. ఈ చికిత్స పద్ధతులపై మన వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

కాంబినేషన్‌ డ్రగ్స్‌ మంచిదే..
కరోనా లక్షణాలు వచ్చినపుడే వైరల్‌లోడ్‌ ఎక్కువగా ఉంటుంది. ఏ జబ్బయినా లక్షణాలను బట్టే నిర్ధారణ అవుతుంది. 2003లో సార్స్‌కు కారణమైన కరోనా వైరస్‌–1 లక్షణాలు వచ్చాక వైరస్‌ లోడ్‌ తీవ్రస్థాయికి చేరుకోవడానికి 10 రోజులు పట్టింది. ప్రస్తుత కోవిడ్‌కు కారణమైన కరోనా వైరస్‌–2 వైరస్‌లోడ్‌.. లక్షణాలు వచ్చి నపుడే తీవ్రస్థాయిలో ఉంటోంది. అందువల్లే ఒకే డ్రగ్‌కు పరిమితం కాకుండా, కాంబినేషన్‌ను సంయుక్తంగా వాడితేనే ఉపయుక్తంగా ఉంటుంది. హాంకాంగ్‌ పరిశోధనల్లో ఈ కాంబినేషన్‌ వాడిన 5 రోజుల్లోనే పీసీఆర్‌ టెస్ట్‌ నెగెటివ్‌ రావడం గుర్తించారు.

ఈ స్టడీ ఇటీవల లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచు రితమైంది. అత్యంత శాస్త్రీయమైన ర్యాండమైజ్డ్‌ కంట్రోల్‌ పద్ధతిలో.. పరిశోధకులు పేర్కొంటున్న మూడు మందులతో పరిశోధన నిర్వహించడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇప్పటికే సార్స్‌పై ఈ కాంబినేషన్లో వాడిన డ్రగ్స్‌ ఫలితమిచ్చాయి. అందువల్ల కరోనా చికిత్సకు ఈ మందులను సంయుక్తంగా వాడాలని ఈ పరిశోధన సూచిం చింది. ప్రస్తుతం 3 దశలు విజయవంతమైనం దున, తదుపరి రెండు దశలు విజయవంతమైతే నాలుగైదు నెలల్లో పూర్తిస్థాయి ఉపయోగానికి ఆమోదం లభించవచ్చు. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల

మందు కంటే వ్యాక్సినే ఉత్తమం
వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. డిసెంబర్‌ నాటికి లేదా వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ రావచ్చని అనుకుంటున్నారు. ఏ వైరస్‌ అయినా సోక కుండా కాపాడేది, నియంత్రించేది వ్యాక్సినే కాబట్టి మందుల కంటే వ్యాక్సినే ఉత్తమం. మందులు ఆయా వైరస్‌ సోకాక వాటికి చికిత్స కోసం, తగ్గించేందుకు ఉపయోగి స్తారు. కాబట్టి డ్రగ్‌ కంటే వ్యాక్సినే సుపీరియర్‌. కాంబినేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌ ప్రయోగించిన పేషెంట్ల సంఖ్య కూడా తక్కువగానే ఉన్నందున, అది ఏ మేరకు ప్రామాణికమనేది కూడా కొంత ఆలోచిం చాలి. వ్యాక్సిన్‌కు సంబంధించి అమెరి కాలో ఎంఆర్‌ఎన్‌ఏ–1273 అనే వ్యాక్సిన్‌పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. – డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, పల్మనాలజిస్ట్‌

మరిన్ని వార్తలు