వచ్చేస్తోంది.. 4G

17 Aug, 2014 02:05 IST|Sakshi
వచ్చేస్తోంది.. 4G

- ఇక అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలు
- నగరంలో అందుబాటులో 4జీ సపోర్టెడ్ మొబైల్స్
- ఏర్పాట్లు చేసుకుంటున్న కంపెనీలు

కరీంనగర్ బిజినెస్: అత్యంత వేగవంతంగా ఇంటర్నెట్ సేవలు... కాపీ చేసి పేస్ట్ చేసినంత ఈజీగా డౌన్‌లోడింగ్స్.. ప్రస్తుతం ఉన్న 2జీ, 3జీ కంటే పది రేట్లు స్పీడ్ కనెక్టివిటీ... చాటింగ్, మెయిలింగ్, బ్రౌజింగ్ స్థానంలోకి దూసుకురానున్న వీడియో కాలింగ్... ఇవన్నీ కూడా అతి తక్కువ నామమాత్రపు ధరకే.. ఇది వినడానికే అద్భుతంగా ఉంది కదూ.. 4జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇవన్నీ నిజం కానున్నాయి. కరీంనగర్‌లో ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 
జీపీఆర్‌ఎస్ నుంచి 4జీ వరకు...

సెల్‌ఫోన్ అనగానే ఎంఎంఎస్‌లు పంపే జీపీఆర్‌ఎస్ సేవలు ఉండేవి. ఆ తర్వాత 2జీ ఎడ్జ్, 3జీ రావడంతో ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, వాట్సప్ వంటి మెసేజ్ చాటింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. 3జీ బ్యాండ్‌విడ్త్ సేవలతో స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల అప్లికేషన్లు హల్‌చల్ చేస్తున్నాయి. నగరంలోకి 4జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలుండడంతో బాండ్‌విడ్త్ కనెక్టివిటీ మరింత పెరగడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సేవల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
 
4జీతో...క్రేజీగా...
2జీ మొన్నటి మాట...3జీ నిన్నటి మాట.. మరింత స్పీడ్‌తో ఇంటర్‌నెట్ సౌకర్యం అందించే 4జీ సేవలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. నగరంలోనూ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని యూత్ ఎదురుచూస్తున్నారు. 2జీ కనెక్టివిటితో అప్‌లోడింగ్ 20 కేబీపీఎస్ నుంచి 40 కేబీపీఎస్, డౌన్‌లోడింగ్ 40 కేబీపీఎస్ నుంచి 3జీతో 128 కేబీపీఎస్ నుంచి 512 కేబీపీఎస్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.

4జీ సేవలు ప్రారంభమైతే త్రీజీకీ పదిరేట్లు కనెక్టివిటీ బ్యాండ్‌విడ్త్ అందుబాటులోకి వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న 1ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్ అనేది నిన్నటి మాటగానే మారిపోతుంది. ఏకంగా 128 ఎంబీపీఎస్ నుంచి 256 ఎంబీపీఎస్ వరకు కనెక్టివిటీ పెరుగుతుంది. వీడియో కాలింగ్, ఆన్‌లైన్ గే మ్స్, ఆన్‌లైన్ షోలు, వీడియో చాటింగ్ ఎంతో నాణ్యతతో అతితక్కువ ధరకే అందుబాటులో లభిస్తాయి. విదేశాల్లో ఉండే వారితో నేరుగా చూస్తూ మాట్లాడే సౌకర్యం మున్ముందు ఉంటుంది. త్రీడీ మానిటర్‌లో అరుుతే పక్కపక్కన కూర్చొని మాట్లాడిన అనుభూతి కలుగుతుంది.
 
ఆపరేటర్ల హంగామా...
 వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలందించే పలువురు ఆపరేటర్లు ఇప్పటికే 2జీ, 3జీ డాంగిల్స్‌ను వివిధ ఆఫర్లతో అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్, యునినార్, ఎయిర్‌సెల్ వంటి ఆపరేటింగ్     సేవలందిస్తున్న సంస్థలు 4జీ సేవల ప్రత్యేకంగా రూపొందించే డాంగిల్స్‌ను రూ.1500 నుంచి రూ.3వేలకు పైగా ఉండేలా అందుబాటులోకి తేనున్నాయి. శామ్‌సంగ్, సోనీ ఇరి క్సన్, హెచ్‌టీసీ, యాపిల్ వంటి సంస్థలు అ డ్వాన్స్ వెర్షన్‌తో 4జీ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చేశాయి. ఆండ్రాయిడ్  కూడా మరింత అధునాతనైమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం నగరంలో 4జీ సఫోర్ట్ చేసేలా ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
 
కొత్త స్పీడ్‌లోకాన్ని చూడబోతున్నాం

ప్రస్తుతం 2జీ, 3జీ మార్కెట్లో నడుస్తున్నాయి. చాలా సేవల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో రోజురోజుకు  ఇంటర్నెట్ వాడేవారు ఎక్కువవుతున్నారు. ప్రభుత్వం కూడా అప్లికేషన్లు, సర్టిఫికెట్లు అన్నీ నెట్‌పై ఆధారపడి ఉంటున్నాయి. ప్రస్తుతం పలు కంపెనీలకు చెందిన 4జీ మొబైల్ ఫోన్‌లు మా స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
 - మహిపాల్‌రెడ్డి, లాట్ మొబైల్‌స్టోర్ మేనేజర్

మరిన్ని వార్తలు