హమ్మయ్య.. పోస్టింగ్ ఇచ్చేశారు..

27 Jan, 2015 03:12 IST|Sakshi

ఎట్టకేలకు కారుణ్య  నియామకాలు
అభ్యర్థులకు పోస్టింగ్‌లు

 
హన్మకొండ : ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో అధికారులు ఎట్టకేలకు కారుణ్య నియామకాల ప్రకియ పూర్తి చేశారు. నెలలకొద్ది ఎ దురు చూస్తున్న అభ్యర్థులకు మంగళవా రం పోస్టింగ్‌లు ఇచ్చారు. 2006 నుంచి వ రంగల్ రీజియన్ పరిధిలో సుమారు 45 కు టుంబాలు కారుణ్య నియామకాలకై ఎదురు చూస్తున్నా యి. ఇందులో 37 కుటుం బాల నుంచి 37 మంది అభ్యర్థులను కా రుణ్య నియామకాల కింద కండక్టర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కూడా వారంతా పాసయ్యా రు. దీనికితోడు వారి అర్హత సర్టిఫికేట్లు సంబంధి త బోర్డులకు పంపించి వెరిఫికేషన్ చేయించారు. ఇక్కడి వరకు సవ్యంగానే జరిగినా ఆ తర్వాత వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆర్టీసీ రీజినల్ ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. అభ్యర్థులు ఎదుర్కొంటు న్న ఇబ్బందులపై ఈ నెల 18న ‘కారుణ్య నియామకాలపై వివక్ష’ అనే శీర్షికతో సాక్షిలో కథ నం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ యాజమాన్యం, అధికారులకు అభ్యర్థుల కు పోస్టింగ్‌లు ఇచ్చారు. 37 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద పో స్టింగ్‌లు ఇచ్చి డిపోలు కేటాయించారు.

ఇందులో 32 మందికి భూపాలపల్లి డిపో లో  పోస్టింగ్ ఇవ్వగా, హన్మకొండ డిపోకు ముగ్గురు, పరకాల, నర్సంపేట డిపోకు ఒక్కొక్కరి చొప్పున కండక్టర్లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. భూపాలపల్లి డిపోకు కె.రమేశ్‌కుమార్, ఎండి మజారుద్దీన్, పి.రాఘవేందర్, టి.దయాకర్, సి.హెచ్.అమృతరావు, ఎస్.కె.అమ్జద్ పాషా, ఆర్.వీరేష్, పి.శ్రీనివాస్, డి.సంతోష్, ఆజీజ్ షాదాబ్, పి.అరుణ్‌కుమార్, ఎస్.రమేష్, ఆర్.కిరణ్‌కుమార్, డి.ప్రవీణ్, సి.హెచ్.ఎస్.కుమార్, జె.అనిల్, ఎం. విజయ్‌కుమార్, బి.కిషన్‌కుమార్, జి.నరేష్,ఎ.సురేష్, ఎస్.కె.ఫయాజ్, టి.వినీల్‌కుమార్, ఎస్.కె.షబ్బీర్, కె.శేఖర్‌బాబు, బి.రాజేష్, బి.ప్రశాంత్, జి.పవన్‌కుమార్, ఎన్.శ్రీను ఎస్.కె.ఖలీల్ పాషా, బి.శ్రీధర్, ఇ.శంకర్, ఎం.రవికుమార్‌ను కేటాయించారు. హన్మకొండ డిపోకు కె.సుష్మ, వి.సరిత, జి.జము న, నర్సంపేట డిపోకు జి.నాగమణి, పరకాలకు పి.నవీనకు పోస్టింగ్‌లు ఇచ్చారు.
 
 

మరిన్ని వార్తలు