జెడ్పీలో కారుణ్య నియామకాలు

7 Feb, 2020 08:17 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు లభించాయి. జిల్లా పరిషత్‌ పరిధిలో మండల, జిల్లాస్థాయిలో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆయా జిల్లాలకు కేటాయించారు. సూపర్‌ న్యూమరీ జూనియర్‌ అసిస్టెంట్లుగా ఆరుగురికి, టైపిస్టులుగా ముగ్గురికి, అడెండర్లుగా నలుగురికి ఉద్యోగం దక్కింది. శుక్రవారం జిల్లా పరిషత్‌ చాంబర్‌లో చైర్మన్‌ జనార్థన్‌ రాథోడ్, వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. జెడ్పీలో రికార్డు అసిస్టెంట్లుగా పని చేస్తున్న నలుగురికి పదోన్నతి కల్పించారు. ఇందులో గుండయ్య (మంచిర్యాల), కూనల్‌సింగ్‌ (ఆదిలాబాద్‌) ఉన్నారు. మరో ఇద్దరు నిరాకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. 2012 నుంచి నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని, చైర్మన్‌గా ఎన్నికై మొదటిసారి కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని నాలుగు జిల్లాలకు కేటాయించామని వివరించారు. సీనియార్టీ జాబితా తయారు చేసి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. 427 జీవో ప్రకారం ప్రతీ యేడాది మంజూరయ్యే ఐదు పోస్టులను కలెక్టర్‌ ద్వారా మంజూరు చేయించామన్నారు. ఈ  జెడ్పీ సీఈవో కిషన్‌ పాల్గొన్నారు. 

ఉద్యోగం పొందిన వారు వీరే..  
సహానబేగం, జూనియర్‌ అసిస్టెంట్, జెడ్పీపీ (మంచిర్యాల), గ్లోరి దీప్తి జూనియర్‌ అసిస్టెంట్, జెడ్పీపీ (ఆసిఫాబాద్‌), ఎం.శీరిష జూనియ ర్‌ అసిస్టెంట్‌ జెడ్పీపీ (నిర్మల్‌), రమణశ్రీ జూని యర్‌ అసిస్టెంట్‌ జెడ్పీపీ (మంచిర్యాల), అర్జున్‌ కుమార్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ జెడ్పీపీ (నిర్మ ల్‌), కె. సిద్దాంత్, జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆదిలాబాద్‌), ఎం.రంజిత్‌కుమార్, టైపిస్టు (నిర్మ ల్‌), టి.తేజశ్రీ టైపిస్టు, (నిర్మల్‌), డి. నాగేంద్ర టైపిస్టు, ఇంద్రవెల్లి, ఎ.దేవుబా యి, అటెండర్‌ (నిర్మల్‌), కె. కల్యాణ్, అటెండర్‌, బోథ్, డి. కల్యాణి, అటెండర్‌ (మంచిర్యాల), అబ్దుల్‌ మజీద్‌, అటెండర్‌ (ఆసిఫాబాద్‌).  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు