కాంపౌండర్‌ ఇక ఫార్మసిస్ట్‌

11 Aug, 2017 03:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆయుర్వేద, యునానీ, హోమి యోపతి విభాగాల్లోని కాంపౌండర్‌ పోస్టును ఫార్మసిస్టుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టు మార్పుతో వేతన పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది.

కొత్తగా ఫార్మసిస్టుగా నియమితులయ్యే వారు ఈ విభాగాల్లో రెండేళ్ల ఫార్మసీ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో ఇదే విధానం ఉందని, భారత కేంద్ర ఔషధ మండలి నియమాలకు అనుగుణంగా ఈ మార్పులు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు