అప్పు.. సంపదకే!

23 Sep, 2019 01:33 IST|Sakshi

మూలధన వ్యయఖర్చుపై ప్రభుత్వానికి కాగ్‌ కితాబు

2017–18లో రూ.26 వేలకోట్ల అప్పులు.. ఖర్చు చేసింది రూ.30 వేలకోట్ల పైమాటే

అంతకుముందు మూడేళ్లలోనూ అదే పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తెచ్చిన అప్పులను మూలధన వ్యయం కింద సంపద సృష్టి కోసం ఖర్చు చేస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కితాబు ఇచ్చింది. సమీకరించిన రుణాలేగాకుండా.. కొంత రెవెన్యూ ఆదాయాన్ని కూడా పెట్టుబడి వ్యయం కింద వెచ్చించిందని తేల్చింది. ఈ మేరకు 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం శాసనసభ ముందుంచిన కాగ్‌ నివేదికలో ప్రభుత్వ అప్పులను ఖర్చు చేసే విధానం ఉపయుక్తంగానే ఉందని అభిప్రాయపడింది. అప్పులను సంపద సృష్టి కోసం వెచ్చించడ వివేకంతో కూడిన ఆర్థిక నిర్వహణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది.

2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కింద రూ.26,231 కోట్లు తీసుకొచ్చిందని కాగ్‌ తన లెక్కల్లో తేల్చింది. ఈ అప్పుల కింద తెచ్చినవాటికి అదనంగా మరో రూ.3,880 కోట్లు కలిపి మొత్తం రూ.30,111 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరమేగాక అంతకుముందు మూడేళ్లు కూడా రుణాలను ఇదేరీతిలో ఖర్చు పెట్టినట్లు కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు