ర్యాగింగ్ నిరోధంపై నేడు సమావేశం

7 Sep, 2015 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి కార్యాచరణ అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ఈనెల 7న సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ ఇటీవల ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధంపై మండలి చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కాలేజీ హాస్టళ్లలో రాత్రి వేళల్లో అధ్యాపకులు నిద్రించాలని, వీలైతే ప్రథమ సంవత్సర విద్యార్థులకు వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు