జనవరి 5న బీసీ ఉద్యోగుల మహాసభలు

24 Dec, 2017 03:03 IST|Sakshi

బీసీ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 5న బీసీ ఉద్యోగుల మహాసభలు నిర్వహించ నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఇక్కడ బీసీ భవన్‌ లో జరిగిన తెలంగాణ బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లా డారు. చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేకున్నా గత పాలకులు బీసీ ఉద్యో గులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్ట లేదని విమర్శించారు.

54 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగులు కేవలం 4 లక్షల 62 వేల మందే ఉన్నారని అన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 50 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులో 14 శాతం ప్రాతినిధ్యం కూడా లేదన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేరని, 2,600 బీసీ కులాల్లో 2,550 కులాలు ఇప్పటివరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు