వద్దంటున్న ఫార్మసీ విద్యార్థులు

22 Nov, 2018 14:42 IST|Sakshi

మెయిన్‌ క్యాంపస్‌కు తరలించాలని అధికారుల నిర్ణయం

వద్దంటున్న ఫార్మసీ విద్యార్థులు

ఎన్నికల తర్వాతే తరలింపుపై నిర్ణయం 

శాతవాహనయూనివర్సిటీ: ఎల్‌ఎండీ కాలనీలోని శాతవాహ న యూనివర్సిటీ ఫార్మసీ ప్రాంగణం వసతిగృహాలు సరైన సదుపాయాలు లేక అధ్వానంగా మారాయి. వీటిలో సరైన సౌకర్యాలు కల్పించాలని, హాస్టళ్లను ఇక్కడినుంచి తరలించా లని విద్యార్థులు గతంలో పలుమార్లు యూనివర్సిటీ అధికా రులను కోరారు. దీంతో యూనివర్సిటీ ఫార్మసీ హాస్టళ్లను వాటి స్థానంలో నూతనంగా నిర్మించడానికి రూ.18 కోట్లకు పైగా నిధులు సిద్ధం చేశారు. ఇప్పుడు అక్కడున్న బాలబాలికలను మెయిన్‌ క్యాంపస్‌కు తరలించాలనే ఆలోచనలో అధి కారులున్నారు. అయితే కొంతమంది ఫార్మసీ విద్యార్థులకు అక్కడి నుంచి మెయిన్‌ క్యాంపస్‌కు రావడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు మెయిన్‌ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులు ఫార్మసీ విద్యార్థులు వస్తే ఇక్కడ వసతులు సరిపోవని అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు ముగిసేవరకూ తరలింపు అంశంపై ఎలాంటి నిర్ణ యం తీసుకోబోమని, ఆలోపు వసతిగృహాల తరలింపుపై స్ప ష్టమైన వైఖరిని వెల్లడించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో ఎన్నికలు ముగిసేవరకూ విద్యార్థులు తీసుకున్న నిర్ణయంపై తరలింపు పక్రియ ఆధారపడనుందని తెలుస్తోంది.

 రూ.18కోట్లతో నూతన హాస్టళ్లు
శాతవాహన యూనివర్సిటీలో ఇన్ని రోజుల నుంచి రేకులషెడ్డుల్లో బాలబాలికల వసతిగృహాలు నిర్వహించబడుతున్నాయి. ఫార్మసీ హాస్టళ్లలో మొత్తం 111 మంది ఉండగా.. ఇందులో బాలురు 32 మంది, బాలికలు 79 మంది ఉన్నారు. గతంలో విద్యార్థులు వసతిగృహాలతోపాటు అంతర్గత రోడ్లు, భవనాలు వంటి వసతులను మెరుగుపర్చాలని గతంలో యూనివర్సిటీని ముట్టడించి అధి కారులను నిలదీశారు. పలు విద్యార్థిసంఘాలు సైతం సమస్యలపై పోరాటాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు స్పందించి అక్కడ నూతనంగా బాలబాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు నిర్మించాలని నిర్ణయించి ప్రభుత్వానికి సూచించగా రూ.18కోట్ల నిధుల కూడా మంజూరయ్యాయి. కొద్దిరోజుల నుంచి ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎన్నికలు ముగియగానే నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని అధికా రులు సిద్ధమయ్యారు. దీనికోసం విద్యార్థులతో వసతిగృహా ల తరలింపుపై సంప్రదింపులు జరిపారు. కొంతమంది విద్యార్థులు తరలింపునకు సుముఖత చూపకపోవడంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు.

 ఎన్నికలు ముగిశాకే తుది నిర్ణయం
ప్రస్తుతం హాస్టళ్లు నిర్మించడం సాధ్యపడదు కాబట్టి ఎన్నికలు ముగిశాక నిర్మాణాలు ప్రారంభించడానికి వీలవుతుందని యూనివర్సిటీ అ ధికారులు భావిస్తున్నారు. మెయిన్‌ క్యాంపస్‌లోని హాస్టళ్ల వి ద్యార్థులు కూడా ఫార్మసీ విద్యార్థుల రాకను వ్యతిరేకిస్తున్నా రు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవులు సోమవా రం ఫార్మసీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇందులో కొంతమంది ఫార్మసీ విద్యార్థులు తరలింపుపై పెదవి విరవడంతో తరలింపుపై తుది నిర్ణయం వి ద్యార్థులకే వదిలేసినట్లు సమాచారం.

విద్యార్థి సంఘాల కన్నెర్ర 
ఫార్మసీ హాస్టళ్ల తరలింపుపై వివిధ విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే 40 ఎకరాలు ఉన్న ఎల్‌ఎండీలోని శాతవాహన ఫార్మసీ క్యాంపస్‌ లో ఐదెకరాలు ఉర్దూ యూనివర్సిటీకి, ఐదెకరాలు ఫిషరీస్‌ కళాశాలకు కేటాయించారని, ఇప్పుడు అక్కడ నుంచి తరలిస్తే మిగితా 30 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూనివర్సి టీ అధికారులు తరలింపును నిలిపివేసి అక్కడే తాత్కాలిక వ సతిని ఏర్పాటు చేసి వసతిగృహాల భవనాలను పూర్తిచేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

 హాస్టళ్ల తరలింపు ఆపాలి:కరికె మహేష్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు
యూనివర్సిటీ అధికారులు ఫార్మసీ వసతిగృహాల తరలింపు నిర్ణయాన్ని ఆపాలి. ఇప్పటికే 40 ఎకరాలున్న యూనివర్సిటీ భూమి 10 ఎకరాలు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. తరలిస్తే ప్రభుత్వం మిగితా 30 ఎకరాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. తరలింపు ప్రక్రియ ఎక్కువశాతం ఫార్మసీ విద్యార్థులకు ఇష్టం లేదు. మెయిన్‌ క్యాంపస్‌ హాస్టళ్ల విద్యార్థులకు కూడా వారు ఇక్కడికి వస్తే వసతులు సరిపోయేలా లేవు. అధికారులు తరలింపు ప్రక్రియను విరమించుకోవ్చాట.  

మరిన్ని వార్తలు