కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే అర్హత లేదు

17 Mar, 2015 00:00 IST|Sakshi

యాదగిరిగుట్ట :కాంగ్రెస్, బీజేపీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం గుట్ట పట్టణ శివారులోని శ్రీసా యి ఫంక్షన్‌హాల్‌లో  ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగుల అభివృద్ధికి  పెద్ద పీట వేస్తోందని అన్నారు.  సీమాంధ్ర ప్రభుత్వాల కాలంలో తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గ్రాడ్యుయేట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
 
  ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ నిర్వాకం వల్లే తెలంగాణ అనేక విధాలుగా నష్టపోయిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అబివృద్ధికి ఏమి చేసిందో స్పష్టం చేయాలని పేర్కొన్నారు. యువతకు, విద్యావంతులకు మేలు జరగాలంటే టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓటు వేయాలని అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఒక అవకాశం కల్పించి గెలిపిస్తే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య,
 
 ఆ పార్టీ యువజన విభాగం ఆలేరు నియోజకవర్గం అధ్యక్షుడు గడ్డమీది రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని, విప్ సునీతారెడ్డిని , పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి యాదగిరిగుట్ట స్వామి వారి చిత్రపటాలతో కూడిన జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి , పవన్‌కుమార్, తుంగబాలు, గుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్న రవీందర్‌గౌడ్, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ వెంకటయ్య , బూడిద స్వామి, సీస కృష్ణ, తాళ్లపల్లి నాగరాజు, మిర్యాల దుర్గాప్రసాద్, అంకం నర్సింహ, బీర్ల మహేష్, పాండవుల భాస్కర్‌గౌడ్, శతృజ్ఞ, కౌడె మహేందర్, ముక్కెర్ల నర్సింహయాదవ్,  బొజ్జ శ్రీనివాస్, వాసం రమేశ్, పేరబోయిన సత్యనారాయణ యాద వ్, బుడిగె సత్తయ్య పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు