దళితులపై కాంగ్రెస్ వివక్ష

24 Sep, 2014 23:34 IST|Sakshi

చేవెళ్ల రూరల్: కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దళితుల పట్ల వివక్షత చూపిస్తోందని. తనను పదవి నుంచి నెల కాలంలో రెండు సార్లు తొలగించటాన్ని బట్టే ఇది తెలుస్తోందని తాజామాజీ డీసీసీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి అన్నారు. ‘జిల్లా డీసీసీ అధ్యక్షుడి మార్పు, క్యామ మల్లేశ్ నియమాకం’ అని మీడియాలో వార్తలు రావటం చూసిన ఆయన చేవెళ్లలో బుధవారం  విలేకర్లతో మాట్లాడారు.  కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య దళితులపట్ల చిన్న చూపు చూస్తున్నారని  ఆరోపించారు.   

తనకు ఎందుకు పదవిని కట్టబెట్టారు.... ఎందుకు తొలగిస్తున్నారో కనీసం సమాచారం ఇవ్వకుండా  వారికిఇష్టం వచ్చిన వారికి పదవిని కట్టబెట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు.  ఒక దళితునిగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే తనను తప్పించి క్యామ మల్లేశ్‌ని తిరిగి నియమించటం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు.  

దళితుడినని, డబ్బులు లేవనే తనను ఇలా తొలగించి డబ్బులు ముట్ట జెప్పిన మల్లేశ్‌కు డీసీసీ పదవీని ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది దళితులకు పార్టీ చేస్తున్న అన్యాయమేనన్నారు.  పార్టీకోసం  గత 30ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నాటినుంచి కేంద్ర కాంగ్రెస్‌పార్టీ దళితులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిందని, ఈనాడు సోనియా గాంధీకూడా దళితులకు న్యాయం చేస్తుంటే రాష్ట్ర నాయకులు దీనిని దిగజారుస్తున్నారన్నారు.

 తనకు అన్యాయం చేసిన  పీపీసీ అధ్యక్షుడు దళితుల వద్దకు ఎలా వెళ్తాడని  ప్రశ్నించారు.  తనకు ఎమ్మెల్యే  సీటు కేటాయించలేదని, పార్టీ మారకూడదని బుజ్జగించి  డీసీసీ అధ్యక్ష పదవిని  ఇచ్చిన పొన్నల లక్ష్మయ్యే ఇప్పుడు తనను  ఆ పదవి నుంచి ఎందుకు తప్పిస్తున్నారో చెప్పాలన్నారు.    ఏప్రిల్ 17న డీసీసీ పదవిని ఇచ్చి  ఆగస్టు 22న తనన మార్చి మళ్లీ క్యామ మల్లేశ్‌కు ఇచ్చినట్లు వార్తలు వస్తే వెంటనే అప్పుడు నాయకులు కలుగ జేసుకొని మేథోమథన సదస్సు ఉందని దానిని అప్పటివరకు నిలిపి వేశారు.  

మళ్లీ నెల రోజులు గడిచిన వెంటనే మళ్లీ అధ్యక్షుడి మార్పు చేయటం సిగ్గు చేటు అన్నారు.  దీన్ని గురిం చి మాజీ హోం మంత్రి సబితారెడ్డికి ఫొన్‌చేసి అడిగితే  టీపీసీసీతో మాట్లాడుతానని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీలు, గుండాలు,  డబ్బులు ఉన్నవారిదే రాజ కీయం నడుస్తోందన్నారు. తాను ప్రజల మనిషిగా ఉం టానని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉం డాలని నిర్ణయించుకుంటున్న ట్లు తెలిపారు.  ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు