పీవీపై వ్యాఖ్యలు.. చిన్నారెడ్డిపై హైకమాండ్‌ ఆగ్రహం

28 Jun, 2019 09:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత ప్రధాని పీవీ నర సింహారావులను ఉద్దేశించి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడింది. దీనిపై తక్షణమే క్షమాపణ లు చెప్పాలని, ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిం దో వివరణ ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. బుధవారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ’ అని విమర్శించారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ సభకు వెళ్లి, సంఘ్‌ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారత రత్నతో సత్కరించిందని అన్నారు. దీనిపై పార్టీలో రాజకీయ దుమారం రేగింది. పార్టీ లోని కొందరు ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ల దృష్టికి తీసుకెళ్లారు.

ఇతర సీనియర్‌ నేతలతో దీనిపై చర్చించిన హైకమాండ్‌ పెద్దలు దీనిపై వివర ణ ఇవ్వాలని చిన్నారెడ్డికి సూచించారు. వారి ఆదేశాల మేరకు ఆయన వివరణతో కూడిన ప్రకటనను గురువారం విడుదల చేశారు. పీవీ నరసింహారావు, ప్రణ బ్‌ ముఖర్జీలు అంటే తనకు అపారమైన గౌరవమని, వారు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీ వారికి గొప్ప అవకాశాలు ఇచ్చిందని చిన్నారెడ్డి అందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పీవీ, ప్రణబ్‌లను కాంగ్రెస్‌ అవమానించిందని అన డం రాజకీయమని, కాంగ్రెస్‌ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానని అంతే కాని పీవీ, ప్రణబ్‌లను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, వారంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటు చేసుకున్నాయని తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధ పడితే అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు