‘కేసీఆర్‌ నిద్ర పోవడం బంద్‌ చేస్తాడు’

1 Jun, 2017 19:43 IST|Sakshi
‘కేసీఆర్‌ నిద్ర పోవడం బంద్‌ చేస్తాడు’

సంగారెడ్డి : ప్రజా గర్జన సభ చూసి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కు ఇక నిద్ర పట్టదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన గురువారం మాట్లాడారు. సంగారెడ్డిలోని అంబేద్కర్‌ స్టేడియంకు ఘన చరిత్ర ఉందన్నారు. 1979 డిసెంబర్‌లో ఇందిరా గాంధీ సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారని,  ఆ తరువాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చారన్నారు.

ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని జగ్గారెడ్డి అన్నారు.  2019 ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయానికి ఈ ప్రజా గర్జన సభే నాంది అన్నారు. 40 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ మనవడు రాహుల్‌ మెదక్‌ గడ్డకు వచ్చారని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి... కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ భిక్షతోనే కేసీఆర్‌ కుటుంబం పదవులు అనుభవిస్తోందన్నారు. కాంగ్రెస్‌పై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరగబడితే అధికారులు ఉండలేరని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ పతనం ఖాయమని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లక్కోరలో మహిళ దారుణ హత్య 

పురుగులమందు పిచికారీకి ఆధునిక యంత్రం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు

‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ హామీ

మరింత ఆసరా!

పైసా వసూల్‌

పురుగుల అన్నం తినమంటున్నారు..!

‘హరీష్‌ శిక్ష అనుభవిస్తున్నాడు’

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

కిడ్నాప్‌ ముఠా అరెస్టు

సారొస్తున్నారు..

డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్‌ కాల్‌

బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు

‘అవ్వ’ ది గ్రేట్‌

పదవిలో ఆమె.. పెత్తనంలో ఆయన

పెట్రో ధరలు పైపైకి..

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!

ఎండిన సింగూరు...

ఖమ్మంలో ఎంతో అభివృద్ధి సాధించాం

డబ్బులు తీసుకున్నారు..   పుస్తకాలివ్వలేదు..

పాములను ప్రేమించే శ్రీను ఇకలేడు..

గొర్రెలు చనిపోయాయని ఐపీ పెట్టిన వ్యక్తి

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

పోడు భూముల సంగతి తేలుస్తా

త్వరలో రుణమాఫీ అమలు చేస్తాం 

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

సత్వర విచారణకు అవకాశాలు చూడండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..