జైపాల్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

30 Jul, 2019 01:13 IST|Sakshi
జైపాల్‌ రెడ్డి భౌతికకాయంపై పార్టీ జెండాను కప్పుతున్న కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, పీసీ చాకో, ఉత్తమ్, పొన్నాల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, సంపత్, వంశీచంద్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా వీడ్కో లు పలికారు. సోమవారం ఉదయం ఆయన నివా సం నుంచి పార్థివదేహాన్ని 12:20 గంటల సమయం లో గాంధీభవన్‌కు తీసుకువచ్చారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన వేదికపై భౌతికకాయాన్ని ఉంచి పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఏఐసీసీ పక్షాన రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, మాజీ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ సభ్యుడు పీసీ చాకో, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా తదితరులు జైపాల్‌ భౌతిక కాయం పై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గూడూరు నారాయణరెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, సంపత్‌ కుమార్, వంశీచంద్‌ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీనివాస కృష్ణన్, జగ్గారెడ్డి, సీతక్క, వి.హనుమంతరావు, మధు యాష్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు నగేశ్, ఈరవత్రి అనిల్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎమ్మార్‌జీ వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్, కుమార్‌రావు తదితరులు జైపాల్‌ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.  

గాంధీభవన్‌కు వచ్చిన ఏచూరి 
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ తనకు జైపాల్‌తో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉందని, యునైటెడ్‌ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటులో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. అరుదైన రాజకీయ నాయకుల్లో జైపాల్‌ ఒకరని, ఆయన ఆకస్మిక మరణం తనను చాలా బాధించిం దని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నెక్లెస్‌రోడ్డులో జైపాల్‌ రెడ్డికి నివాళులర్పించారు. 

సెక్యులర్‌ అంటే గుర్తొస్తారు: ఆజాద్‌ 
జైపాల్‌రెడ్డితో తనకు దశాబ్దాల పరిచయం ఉందని, ఇద్దరం వేరే పార్టీల్లో ఉన్నా మంచి మిత్రులుగా ఉన్నామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జైపాల్‌ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. సెక్యులర్‌ అంటే మొదట గుర్తొచ్చేది జైపాల్‌ రెడ్డేనని, సెక్యులరిజం, సోషలిజం మార్గంలో నడవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. జైపాల్‌ ఉత్తమ పార్లమెంటేరియన్, బహుభాషా కోవిదుడని, ఏ శాఖ మంత్రిగా అయినా నిజాయతీతో పనిచేశారన్నారు. 

మన్మోహన్‌ మెచ్చిన నేత: ఖర్గే 
జైపాల్‌తో తనకు 1963 నుంచి పరిచయం ఉందని, తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే జైపాల్‌ తనకు తెలుసునని లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. మన్మోహన్‌సింగ్‌ మెచ్చిన నేత జైపాల్‌రెడ్డి అని, ఆయన మాట్లాడుతుంటే డిక్షనరీలు వెతుక్కునే వారమన్నారు. రాజ్యసభ సభ్యుడు చాకో మాట్లాడుతూ జైపాల్‌ రెడ్డితో కలిసి పనిచేశానని, నిబద్ధత, నిజాయతీకి ఆయన మారుపేరని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మాట్లాడుతూ సోషలిజం, సెక్యులరిజంలకు జైపాల్‌ చాంపియన్‌ అని కొనియాడారు. కాంగ్రె స్‌ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భూమి పుత్రుడు జైపాల్‌రెడ్డి దేశరాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు.  

ఇక సెలవ్‌
సాక్షి, హైదరాబాద్‌ : సాగర తీరం శోకసంద్రమైం ది. తమ ప్రియతమ నేతకు  వీడ్కోలు పలికేందు కు అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చా రు. వీరందరి అశ్రునయనా ల సమక్షంలో.. నెక్లెస్‌రోడ్డు లోని పీవీ ఘాట్‌లో సోమ వారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాల తో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు జైపాల్‌రెడ్డి పెద్ద కొడుకు అరవింద్‌రెడ్డి చితికి నిప్పంటించారు. కర్ణాటక మాజీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌.. జైపాల్‌ రెడ్డి భౌతికకాయా న్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.  

భారీ ర్యాలీగా అంతిమ యాత్ర 
అంతకుముందు ఉదయం అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10లోని ఆయన నివాసం నుంచి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీల నేతలు, అభిమానుల మధ్య అంతిమయా త్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. అక్కడి నుంచి  అంతిమ యాత్ర గాంధీభవన్‌కు చేరుకుంది.  హోంమంత్రి మహమూద్‌ అలీ, స్పీక ర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు జగదీ‹ష్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌ రావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల, నాగం జనార్దన్‌రెడ్డి, మల్లు రవి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాయిని, మధుయాష్కీ గౌడ్, గండ్ర వెంకట రమణారెడ్డి, నేతి విద్యాసాగర్, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. 
నివాళులు అర్పించిన ప్రముఖులు 
కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, మంత్రి తల సాని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ డీ ఎస్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, కేశవరావు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, గద్దర్‌ సహా పలువురు కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. 

జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన రాజ్యసభ 
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌రెడ్డికి రాజ్యసభ నివాళులర్పించింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు జైపాల్‌రెడ్డి మరణంపై సంతాప ప్రకటన చేశారు. ‘ఈ సభ మాజీ సభ్యుడు ఎస్‌.జైపాల్‌రెడ్డి తన 77వ ఏట నిన్న ఉదయం మరణించారు. ఆయన మరణంతో దేశం ఒక సీనియర్‌ పార్లమెంటేరియన్‌ను, ఒక అత్యుత్తమ వక్తను, సమర్థవంతుడైన అడ్మినిస్ట్రేటర్‌ను కోల్పోయింది. ఏపీ అసెంబ్లీలో రెండు పర్యాయాలు ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఒకే బెంచిలో కూర్చునేవాళ్లం. ప్రజాసంబంధ అంశాలపై ఎవరి మార్గంలో వాళ్లం వాదించేవాళ్లం. నాలుగు దశాబ్దాలుగా ఆయన నాకు స్నేహితుడు. ఆయన కంటే నేను ఆరేళ్లు చిన్నవాడిని. అందువల్ల ఆయన అనేక సందర్భాల్లో నాకు మార్గదర్శనం చేసేవారు. జైపాల్‌ రెడ్డి మరణానికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం..’అని చైర్మన్‌ అన్నారు. జైపాల్‌రెడ్డి మరణానికి సంతాపం తెలిపేం దుకు సభ్యులు లేచి మౌనం పాటించారు.   

మరిన్ని వార్తలు