‘అప్పుడు ప్రజలు మీకు బుద్ది చెప్పారు’

7 Sep, 2018 18:50 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : 2008లో టీఆర్‌ఎస్‌ 18 స్థానాలు రాజీనామా చేస్తే 7 మాత్రమే గెలిచిందని అప్పుడు ప్రజలు వారికి బుద్ది చెప్పారని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేసినందుకు ప్రజలు బుద్ది చెప్పక తప్పదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చటంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 14 వేలు భర్తీ చేసి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధించలేదని, ఇస్తామంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నావా కేసీఆర్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పేరుతో కమీషన్ల కోసం 50 వేల కోట్లు దుర్వినియోగం చేస్తే తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 20లేదా 30 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు