బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్‌

22 Feb, 2017 02:54 IST|Sakshi
బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు అని మభ్యపెట్టి రాజ్యాధికారం, పదవులన్నీ కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తుందా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు చదువును దూరం చేసి, ఓట్ల కోసం తాయిలాలతో కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అధిష్టాన వర్గం అనుమతిస్తే రాష్ట్రంలో బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు