నోముల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

1 Jun, 2018 07:07 IST|Sakshi
త్రిపురారం : పార్టీలో చేరుతున్న నాయకులు, నిడమనూరు మండలం రాజన్నగూడెంలో

త్రిపురారం : అనుముల మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఆదర్శరైతు మజ్జిగపు అనంతరెడ్డితో పాటు మరికొంత మంది కార్యకర్తలు గురువారం హాలియా మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి నోముల నర్సింహయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో సాగర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు చల్లా మట్టారెడ్డి, యూత్‌ అధ్యక్షుడు సురభి రాంబాబు, నాయకులు నల్లబోతు వెంకటయ్య, చాపల సైదులు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాతంగి కాశయ్య, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

 
నిడమనూరు :
పార్టీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ నోముల నర్సింహయ్య, యడవెల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాజన్నగూడెంలో బీజేపీకి చెందిన పలువురు గురువారం నోముల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే ముఖ్యమంత్రి మొదటి స్థానంలో ఉన్నాడన్నారు.

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి కేసీఆర్‌ వివిధ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు మండలి యాదగిరి, ఉపాధ్యక్షుడు మండలి గోపి, యూత్‌ అధ్యక్షుడు జంగిలి రాంబాబు, గ్రామ శాఖ కోశాధికారి పెందోటి వీరయ్య, వట్టి శంకరయ్య, బొల్లం సైదయ్య, మండలి సోమశేఖర్, జంగిలి కోటి ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రవి, సత్యనారాయణ, నర్సయ్య, శ్రీను, గంగరాజు, కోటయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు